
విద్యకు అధిక ప్రాధాన్యత
భువనగిరి: విద్యకు అఽత్యధిక ప్రాధాన్యత ఇస్తానని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గురువారం కలెక్టరేట్‌లో ఐదుగురు విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. వచ్చే ఏడాది ప్రతి కళాశాలలో నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తే 50 సైకిళ్లను అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఐఈఓ రమణి పాల్గొన్నారు.
సమాజాభివృద్ధికి విద్య దోహదం
సమాజాభివృద్ధికి విద్య ఎంతగానో దోహదం చేస్తుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, డీఐఈఓ రమణి, ఎస్సీ షెడ్యూల్డ్ అధికారి వసంతకుమారి, ఇన్‌చార్జి విద్యాశాఖ అధికారి ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ హనుమంతరావు