
104 సేవలకు సెలవేనా!
భువనగిరిటౌన్ : వైద్య ఆరోగ్య శాఖకు చెందిన 104 వాహనాలు తుప్పు పట్టిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి మందులు సరఫరా చేసేందుకు 2008లో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం 104 వాహనాలు సమకూర్చింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022లో 104 సేవలను రద్దు చేయడంతో వాహనాలు మూడేళ్లుగా మూలనపడ్డాయి. వీటిని కలెక్టరేట్ ఆవరణలో పార్కింగ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 104 సేవలను తిరిగి పునరుద్ధరిస్తుందని ప్రజలు ఆశించినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఎండకు ఎండి.. వానకు తడుస్తూ..
104 పథకాన్ని ఎత్తివేసినందున రెండేళ్ల క్రితం వాహనాలను వేలం వేసేందుకు అధికారులు నిర్ణయించారు. కానీ అమలుకాలేదు. ఒక్కో వాహనాన్ని సుమారు రూ.7లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. ప్రస్తుతం అవి ఎండకు ఎండి, వానకు తడుస్తున్నాయి. ఉమ్మ డి జిల్లాకు 24 వాహనాలు మంజూరు కాగా.. అందులో నల్లగొండ 11, యాదాద్రి భువనగిరి 7, సూర్యాపేట జిల్లాకు 6 కేటాయించారు.
ఫ మూడేళ్ల క్రితం నిలిచిన సేవలు
ఫ మూలనపడ్డ వాహనాలు