
ఈదురు గాలులతో దెబ్బతిన్న పండ్ల తోటలు
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురు గాలులతో కూడిన అకాలం వర్షానికి పండ్ల తోటల రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. మోత్కూరు పరిధిలోని బుజిలాపురంలో రైతు చింత విజయభాస్కర్‌రెడ్డికి చెందిన 12 ఎకరాల మామిడి, రెండు ఎకరాల సపోట తోటల్లో భారీగా కాయలు రాలి కొమ్మలు విరిగాయి. దీంతో సుమారు రూ.9 లక్షల నష్టం వాటిల్లిందని రైతు విజయభాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేగ్రామంలో కొల్లు శంకరయ్య, వల్లందాస్ వెంకటయ్య, వరికుప్పల రామచంద్రు, భీమగాని చంద్రయ్యకు చెందిన మామిడి తోటలో కాయలు నేల రాలాయి. పండ్లతోటలు నష్టపోయిన తమకు పరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

ఈదురు గాలులతో దెబ్బతిన్న పండ్ల తోటలు