రియల్‌ఎస్టేట్ సంస్థపై కేసు నమోదు
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేట గ్రామంలో ప్రభుత్వ భూమిని తమ లేఅవుట్‌లో చూపించి ప్లాట్లు అమ్ముతున్న ఓ ప్రముఖ రియల్‌ఎస్టేట్ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ వివరాలు వెల్లడించారు. గతంలో ఓ రియల్ ఎస్టేట్ 1991 డీటీసీపీ లేఅవుట్ చేసి ప్రభుత్వ భూమిని కూడా వెంచర్ లేఅవుట్‌లో చూపించిదని, ప్రస్తుతం ఇదే వెంచర్‌ను మరో సంస్థ సంస్థ డెవలప్ చేసి ప్రభుత్వ భూమిని లేఅవుట్‌లో చూపించి ప్లాట్లు విక్రయిస్తోందని, దీనిపై చౌటుప్పల్ తహసీల్దార్ హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.