హుజూర్‌నగర్: యువతిని లైంగికంగా వేధించిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. శుక్రవారం సీఐ చరమంద రాజు ఎస్‌ఐ ముత్తయ్యతో కలిసి పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. హుజూర్‌నగర్‌లోని స్వామి రోజా, ఆమె ప్రియుడు నూకతొట్టి ప్రమోద్ కుమార్, మరొక వ్యక్తి లచ్చిమళ్ల హరీష్ కలిసి ఈనెల 18న ఒక యువతిని బలవంతంగా కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రమోద్, హరీష్‌లు యువతిని లైంగికంగా వేధించారు. వారి నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులైన నూకతోట్టి ప్రమోద్ కుమార్, స్వామి రోజాను పట్టణంలో వారు తమ ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. వారిని అరెస్ట్ చేసి కారు, రెండు సెల్‌ఫోన్లు, ఒక బాండ్ పేపర్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు లచ్చిమళ్ల హరీష్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. ప్రమోద్ కుమార్‌పై హుజూర్‌నగర్, మఠంపల్లి, గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదైనట్లు తెలిపారు. సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.