పాడి రైతులు..
ఫ బ్రహ్మోత్సవాల్లో అంజలి
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025
సాక్షి, యాదాద్రి: పాడి రైతులకు రెండు నెలలుగా పాల బిల్లులు రాక అరిగోస పడుతున్నారు. మదర్ డెయిరీ, కరీంనగర్ డెయిరీ, విజయ డెయిరీ ఇలా పలు డెయిరీల్లో పాలు పోస్తున్న రైతులకు సకాలంలో బిల్లులు అందడం లేదు. రెండు నెలలుగా మదర్ డెయిరీలోనే సుమారు రూ. 24కోట్ల పాల బిల్లులు నిలిచిపోయాయి. పాలబిల్లులు సకాలంలో రాక రైతులు మదర్‌డెయిరీని వదిలి విజయ డెయిరీ, ఇతర ప్రైవేట్ డెయిరీలలో పాలు పోస్తున్నారు. గత సంవత్సరం 24 వేల మంది పాడి రైతులు 80 వేల లీటర్ల పాలు పోస్తే, ప్రస్తుతం 22 వేల మంది రైతులు 60 వేల లీటర్ల పాలు పోస్తున్నారు. ప్రస్తుతం మదర్ డెయిరీ సుమారు 80 వేల లీటర్ల పాలు విక్రయిస్తోంది. మదర్ డెయిరీ రైతులకు నాలుగు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. డిసెంబర్ 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఐదు బిల్లులు రైతుల ఖాతాల్లో రూ.20 కోట్లు జమ చేయాల్సి ఉంది.
బిల్లులు రాక పెరుగుతున్న అప్పులు
పాడి పశువులకు ఇచ్చే పల్లీచెక్క, మక్కపిండి, పత్తిచెక్క, తవుడు, కాల్షియం, నాణ్యమైన గడ్డి ధరలు, పెంపకం, వైద్యం, కూలీల ఖర్చులు పెరిగాయి. దీంతో అప్పు చేసి తెచ్చిన పాడి పశువులను రైతులు కోతకు విక్రయిస్తున్నారు. మదర్‌డెయిరీ క్రమం తప్పకుండా బిల్లులు ఇస్తే పెట్టుబడులు పోను గిట్టుబాటు అయ్యేదని రైతులు పేర్కొంటున్నారు. కొన్ని పాల సంఘాలు మాత్రం తమ రైతులకు ఒకటి, రెండు నెలల బిల్లులు సొసైటీల వాటాధనం నుంచి చెల్లిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ విజయ డెయిరీకి సంబంధించి రెండు నెలలుగా నాలుగు బిల్లులు సుమారు రూ.3.20కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతిరోజు సుమారు 15 వేల లీటర్ల పాలను 1800 మంది రైతులు పోస్తున్నారు. లీటరు పాలపై ఇచ్చే రూ.4 ప్రోత్సాహకం మదర్, విజయ డెయిరీల్లో రావడం లేదు.
ఫ మదర్ డెయిరీలో రెండు నెలలుగా నిలిచిపోయిన సుమారు
రూ.24కోట్ల పాల బిల్లులు
ఫ విజయ డెయిరీ, ఇతర
ప్రైవేట్ డెయిరీలను ఆశ్రయిస్తున్న రైతులు
మదర్ డెయిరీలో పాలశీతలీకరణ కేంద్రాలు 24
పాల సొసైటీలు 435
పాలు పోసే రైతుల సంఖ్య సుమారు 22వేలు
రోజువారీగా వస్తున్న పాలు 60వేల లీటర్లు
మదర్ డెయిరీ విక్రయిస్తున్న పాలు 80వేల లీటర్లు
ప్రైవేట్‌గా డెయిరీ కొనుగోలు చేస్తున్న పాలు 20వేల లీటర్లు
మదర్‌డెయిరీకి సంబంధించి పాల ఉత్పత్తి దారులు, పోస్తున్న పాలు
సంవత్సరం పాలఉత్పత్తి పోస్తున్న
దారుల సంఖ్య పాలు (లీటర్లలో)
2020 32,000 1,00,000
2021 30,000 56,000
2022 27,500 55,000
2023 25,500 57,000
2024 24,000 80,000
2025 22,000 60,000
నష్టాల పాలు