
రాష్ట్రపతి భవన్‌లో చండూరు చేనేత వస్త్రాల ప్రదర్శన
చండూరు: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో చండూరుకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత గంజి యాదగిరి, జాతీయ మెరిట్ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. బుధవారం రాత్రి తాము తయారుచేసిన చేనేత వస్త్రాలను ప్రదర్శించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు వివరించారు. అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి తెలంగాణ నుంచి ఎంపికై న 20 మందిలో తాము ఉండడం, రాష్ట్రపతి భవనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉందని గంజి యాదగిరి, చిలుకూరి శ్రీనివాసులు పేర్కొన్నారు.