మోత్కుపల్లి నిరసన గళం | - | Sakshi
Sakshi News home page

మోత్కుపల్లి నిరసన గళం

Apr 20 2024 1:35 AM | Updated on Apr 20 2024 1:35 AM

- - Sakshi

సాక్షి, యాదాద్రి : మాజీ మంత్రి సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు సొంత పార్టీపై నిరసన గళం వినిపిస్తున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానంపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎంపీ టికెట్ల కేటాయింపులో మాదిగలకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో ఒక్క సీటు ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో తమ జాతికి జరిగిన అన్యాయాన్ని ఆయన మీడియా, సోషల్‌మీడియా వేదికల ద్వారా అధిష్టానం దృష్టికితీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో మాదిగ సామాజికవర్గానికి టికెట్‌ లభించలేదని అంటున్నారు. తాను పార్టీలోనే ఉంటూ తమ జాతికి టికెట్‌ కోసం చివరి వరకు ప్రయత్నం చేస్తానంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మోత్కుపల్లి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నది వేచిచూడాలి.

రేవంత్‌ పునరాలోచించాలి

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధిష్టానంగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి మాదిగలకు టికెట్లు ఇచ్చే విషయంలో పునరాలోచించాలని మోత్కుపల్లి కోరుతున్నారు. ప్రధానంగా కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వడాన్ని మోత్కుపల్లి తప్పుపడుతున్నారు. తమ జాతికి టికెట్ల కోసం కాంగ్రెస్‌లో ఉంటూ ప్రయత్నిస్తానంటున్నారు. సామాజిక న్యాయం పాటించడంలో ముందుండే కాంగ్రెస్‌ పార్టీ.. నామినేషన్లు పూర్తయ్యేలోపు మాదిగలకు టికెట్లు ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నానని మోత్కుపల్లి ‘సాక్షి’తో చెప్పారు.

ఉమ్మడి జిల్లాలో మోత్కుపల్లి ప్రభావం

మాదిగ సామాజికవర్గానికి చెందిన సీనియర్‌ నేతగా మోత్కుపల్లి నర్సింహులు ప్రభావం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలు మెజార్టీగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్‌ మాదిగలకు టికెట్‌ ఇవ్వకుండా అన్యాయం చేసిందన్న ప్రచారం ఆ వర్గం నుంచి ఇప్పటికే జోరందుకుంది. అగ్గికి వాయువు తోడైనట్లు మాదిగ సామాజికవర్గ నేతలకు మోత్కుపల్లి అండ లభిస్తోంది. దీంతో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్‌ సీట్ల పరిధిలో జరిగే నష్టం ఎంత అన్న కోణంలో చర్చ జరుగుతోంది.

ఫ మాదిగలకు ఎంపీ టికెట్ల కోసం

కాంగ్రెస్‌తో అంతర్గత పోరు

ఫ రెండు పార్లమెంట్‌ సీట్లు

కేటాయించాలని డిమాండ్‌

ఫ పార్టీ మారేది లేదంటూనే..

అసమ్మతి రాగం

ఫ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభావం

చూపనున్న మోత్కుపల్లి నర్సింహులు

Advertisement
 
Advertisement
Advertisement