ఏపీఏఐఎంఎస్‌ యాప్‌పై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఏపీఏఐఎంఎస్‌ యాప్‌పై అవగాహన కల్పించాలి

Jul 3 2026 1:58 AM | Updated on Jul 3 2026 1:58 AM

ఏపీఏఐఎంఎస్‌ యాప్‌పై అవగాహన కల్పించాలి

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని, ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ పై ప్రతి రైతుకూ అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి వ్యవసాయాధికారులు ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువుల పంపిణీపై గురువారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు, గ్రామస్థాయి వ్యవసాయ శాఖ సిబ్బందికి టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈ–క్రాప్‌ వివరాల ఆధారంగా రైతులకు అవసరమైన మేరకు రైతులకు ఎరువుల పంపిణీ చేయాలని సూచించారు. ఎరువుల నిల్వలను డీలర్లు తప్పనిసరిగా నోటీస్‌ బోర్డులపై ప్రదర్శించాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయాధికారి హబీబ్‌ బాషా, వ్యవసాయ, అనుబంధ శాఖలకు చెందిన మండల, గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement