యలమంచిలి: పాలకొల్లు కోకోనట్ మర్చంట్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి. అప్పారావు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా (డీఐఈఓ) పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా చాంబర్స్ కళాశాల యాజమాన్యం గురువారం ఆయ న్ను సత్కరించింది. చైర్మన్ కేవీఆర్ నరసింహారావు మాట్లాడుతూ ఇంటర్ విద్యా ఉపాధి కోర్సులను మరింత అభివృద్ధి చేసి, తీర ప్రాంత విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలోని జూనియర్ కళాశాలలను రాష్ట్రంలో ముందు వరుసలో నిలపాలని ఆకాంక్షించారు. కళాశాల కార్యదర్శి కేవీ సీతారామరాజు, చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కటారి నాగేంద్ర కుమార్, చాంబర్స్ కళాశాలల ప్రిన్సిపాల్ డి.వెంకటేశ్వరరావు అభినందనలు తెలిపారు.


