న్యూస్‌రీల్
భక్తులు భాగస్వాములు కావాలి
గురువారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2026
భీమవరం(ప్రకాశం చౌక్): బంగారం చందాల సేకరణ కోసం 12 మందితో ఒక ప్రత్యేక బంగారం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆలయంలో భక్తులు, దాతల నుంచి బంగారం లేదా నగదు రూపంలో చందాలు సేకరించే పనిని ప్రారంభించింది. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ ద్వారా ఇప్పటివరకు 13 గ్రాముల బంగారం చందాల రూపంలో వచ్చింది. రాబోయే మూడేళ్ల కాలంలో మిగిలిన 27 కిలోల బంగారాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
స్వర్ణమయ కై ంకర్యంలో భాగస్వాములుకండి
మావుళ్లమ్మ అమ్మవారిని పూర్తి స్వర్ణమయం చేయడానికి దాతలు, భక్తులు తమ స్తోమతను బట్టి బంగారం లేదా నగదును విరాళంగా అందించవచ్చు. గతంలో కేవలం బంగారం ఉన్నవారే సమర్పించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు, సామాన్య భక్తులు కూడా తమకు తోచిన నగదును చందాగా ఇచ్చి అమ్మవారి స్వర్ణమయ కై ంకర్యంలో భాగస్వాములు కావచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.
ఇప్పటివరకు 75 కిలోల బంగారం సేకరణ
అమ్మవారిని 100 కిలోల బంగారంతో శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు 2009లోనే ఈ బంగారం సేకరణ ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు భక్తులు, దాతలు స్వచ్ఛందంగా 75 కిలోల బంగారాన్ని సమర్పించారు. దాతలు 2 గ్రాముల నుంచి 46 గ్రాముల వరకు తమ శక్తి కొద్దీ బంగారాన్ని అందించారు. ఈ 75 కిలోల బంగారంలో ఇప్పటికే 52 కిలోల బంగారాన్ని ఆభరణాల రూపంలో అమ్మవారికి అలంకరించారు. మిగిలిన 23 కిలోల బంగారాన్ని కొత్త ఆభరణాల తయారీ కోసం సిద్ధం చేశారు. అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం కోసం మరో 27 కిలోల బంగారం అవసరం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం అమ్మవారికి బంగారం సమర్పిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉండేవారు ఆలయ అధికారులను సంప్రదించి, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా నగదు విరాళాలను పంపవచ్చు.
దేశవ్యాప్తంగా గుర్తింపు
100 కిలోల బంగారంతో పూర్తి స్వర్ణమయమైన తర్వాత, సంవత్సరంలో 365 రోజులూ భక్తులకు స్వర్ణమయ రూపంలో దర్శనమిచ్చే ఏకై క అమ్మవారిగా మావుళ్లమ్మ ఖ్యాతి గడించనున్నారు. సుమారు రూ.90 లక్షల వ్యయంతో నెల రోజుల పాటు జరిగే అమ్మవారి వార్షిక జాతర, భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులు, నిత్య అన్నదానం, సాంస్కృతిక ప్రదర్శనలు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల సందడితో ఈ ఆలయం ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ స్వర్ణమయ ప్రాజెక్టుతో అమ్మవారి కీర్తి ప్రపంచవ్యాప్తం కానుంది.
భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారిని 100 కిలోల బంగారంతో స్వర్ణమయం చేసేందుకు దాతలు, భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు భక్తులు స్వచ్ఛందంగా బంగారం సమర్పిస్తూ వచ్చారు. అయితే, అమ్మవారిని పూర్తి స్వర్ణమయం చేయాలనే లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేసేందుకు దేవదాయ శాఖ మరో అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా బంగారం, నగదు రూపంలో విరాళాలు వసూలు చేసేందుకు ఒక ప్రత్యేక ప్రాజెక్టును తలపెట్టింది.
శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి పూర్తి స్వర్ణమయం కోసం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బంగారం, నగదు చందాలను సేకరిస్తున్నాము. ఒక ప్రత్యేక కమిటీ ద్వారా ఈ కార్యక్రమం పారదర్శకంగా సాగుతోంది. ఆలయంలో ప్రత్యేక కౌంటర్ కూడా అందుబాటులో ఉంది. భక్తులు, దాతలు ఈ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి స్వర్ణమయ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలి
– బుద్దా మహాలక్ష్మి నగేష్, సహాయ కమిషనర్, ఈవో, మావుళ్లమ్మ దేవస్థానం
పసిడి కాంతులు
మావుళ్లమ్మ స్వర్ణమయానికి బంగారం సేకరణ
100 కిలోల సేకరణ లక్ష్యం
ఇప్పటికే 75 కిలోల విరాళాలు
52 కిలోలతో ఆభరణాల అలంకరణ
కొత్తగా బంగారు కమిటీ ఏర్పాటు


