ప్రమాదవశాత్తూ పంటబోదెలో పడి.. | - | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తూ పంటబోదెలో పడి..

Jul 2 2026 7:01 AM | Updated on Jul 2 2026 7:01 AM

నేడు జ్యేష్ట మాస జాతర ప్రమాదవశాత్తూ పంటబోదెలో పడి..

నేడు జ్యేష్ట మాస జాతర
భీమవరం (ప్రకాశం చౌక్‌): భీమవరం మావుళ్లమ్మవారి ఆలయంలో గురువారం జ్యేష్ట మాస జాతర నిర్వహించనున్నారు. గ్రామోత్సవం, ప్రత్యేక పూజలు చేయనున్నారు.

తాడేపల్లిగూడెం రూరల్‌: ప్రమాదవశాత్తు పంట బోదెలో పడి ఓ మోటారుసైక్లిస్ట్‌ మృతి చెందాడు. రూరల్‌ ఎస్సై ఎస్‌.రవికుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పట్టెంపాలెం గ్రామానికి చెందిన కట్టా అఖిల్‌ (31) మంగళవారం రాత్రి కుంచనపల్లిలో ఫంక్షన్‌కు తన స్నేహితుడు సతీష్‌తో కలిసి తన మోటారు సైకిల్‌పై వెళ్లాడు. తిరిగి అదే రోజు అర్ధరాత్రి స్వగ్రామం పట్టెంపాలెం బయల్దేరాడు. చినతాడేపల్లి యింకుల్లు కళ్యాణ మండపం సమీపంలోకి వచ్చేసరికి మలుపును గుర్తించకపోవడంతో ప్రమాదవశాత్తు ఆ పక్కనే ఉన్న పంట బోదెలో పడి మృతి చెందాడు. బుధవారం ఉదయానికి కూడా అఖిల్‌ ఇంటికి రాకపోవడంతో భార్య సత్యదుర్గ తన బావమరిదికి ఫోన్‌ చేసి ఆరా తీసింది. అనంతరం చినతాడేపల్లి వద్ద పంట బోదెలో పడి మృతి చెంది ఉన్న అఖిల్‌ను గుర్తించి కుటుంబ సభ్యులకు విషయం ఫోన్‌ ద్వారా తెలియజేశాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు రూరల్‌ పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అఖిల్‌ భార్య సత్యదుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఎస్సై రవికుమార్‌ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement