ఆ భూమి దేవుడికే చెందాలి | - | Sakshi
Sakshi News home page

ఆ భూమి దేవుడికే చెందాలి

Jul 2 2026 7:01 AM | Updated on Jul 2 2026 7:01 AM

ఆ భూమి దేవుడికే చెందాలి

దాత వెంకట సంపత్‌కుమారాచార్యులు కుటుంబీకులైన, హైదరాబాద్‌కు చెందిన మంత్రరత్నం ప్రతివాద భయంకర రాధాకృష్ణమాచార్యులు, పార్థసారథి అయ్యంగార్‌లు సదరు భూమి ఆన్‌లైన్‌ రికార్డును కుల సంఘం పేరున మార్చడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఇటీవల కలెక్టర్‌, ఆర్డీవో, దేవస్థానం ఛైర్మన్‌, ఈఓ, తహసీల్దార్‌కు కొద్దిరోజుల క్రితం రిజిస్టర్‌ పోస్టు ద్వారా ఒక లేఖ పంపారు. దేవస్థానం ఆధీనంలో ఉన్న ఆ భూమి బయట వ్యక్తులకు చెందకూడదని, అవసరమైతే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. దాత కుటుంబీకులు స్పష్టంగా సదరు భూమి దేవస్థానంకు చెందినదని చెబుతున్నప్పటికీ, ఎమ్మెల్యే మద్దిపాటి మాత్రం ఇంకా ఆ భూమి దేవుడిదని ఒప్పుకోకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement