విద్యార్థులకు సమగ్ర బోధన అందించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు సమగ్ర బోధన అందించాలి

Jul 1 2026 1:40 AM | Updated on Jul 1 2026 1:40 AM

విద్యార్థులకు సమగ్ర బోధన అందించాలి

తాడేపల్లిగూడెం : విద్యార్థుల సమగ్ర వికాసంలో ఆచార్యుల పాత్ర ఎంతో కీలకమని ఏపీ నిట్‌ ఇన్‌చార్జి డైరక్టర్‌, ప్రొఫెసర్‌, డాక్టర్‌ ఎన్‌వీ రమణారావు అన్నారు. ఏపీ నిట్‌ డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో బ్యాలెన్స్‌డ్‌ క్లబ్‌ సహకారంతో ప్రాంగణంలోని సెమినార్‌ హాల్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ అప్‌గ్రేడేషన్‌ ప్రోగ్రామ్‌ మంగళవారం ముగిసింది. ఎన్‌వీ రమణారావు ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ విద్యార్థుల మోనటరింగ్‌, మానసిక శ్రేయస్సు, విద్యా మార్గదర్శకత్వం, సానుకూల క్యాంపస్‌ సంస్కృతి ప్రోత్సాహానికి ఆచార్యులను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఇటువంటి కార్యాక్రమాలు ఎంతగానో దోహద పడతాయని తెలిపారు. విద్యార్థులకు సమగ్ర బోధన అందించడంతో పాటు వారి మానసిక శ్రేయస్సుపై కూడా ఆచార్యులు ప్రత్యేక దృష్టి సారించాలని వెల్లడించారు. ప్రొఫెసర్‌ అమృతా డేబ్‌, టీజు ఽథామస్‌ మెంటల్‌ వెల్‌ బీయింగ్‌ అండ్‌ ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఫర్‌ ఫ్యాకల్టీ, స్టూడెంట్‌ మెంటరింగ్‌ స్కిల్స్‌ అనే అంశాలపై ఆన్‌లైన్‌లో మాట్లాడారు. డాక్టర్‌ హిమ బిందు, టేకి శ్రీవాణి, మైత్రి సుధాకర్‌ డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ బెహరా, పి.దినేష్‌ రెడ్డి, జి.రవికిరణ్‌ శాస్త్రి తదితరులు మాట్లాడారు. అనంతరం ఆచార్యులను సత్కరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement