కుట్ర రాజకీయాలను ఎదుర్కొంటాం | - | Sakshi
Sakshi News home page

కుట్ర రాజకీయాలను ఎదుర్కొంటాం

Jun 30 2026 1:00 AM | Updated on Jun 30 2026 1:00 AM

కుట్ర రాజకీయాలను ఎదుర్కొంటాం మాజీ మంత్రి కారుమూరికి పార్టీ నేతల మద్దతు

ఏలూరు టౌన్‌ : వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి ప్రతి నాయకుడు, కార్యకర్త అండగా నిలుస్తారనీ, మేమంతా మీతోనే అంటూ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. మాజీ మంత్రి కారుమూరిని ఆయన నివాసంలో పార్టీ నేతలంతా కలిసి సంఘీభావం ప్రకటించారు. మద్యం అక్రమ కేసులో అరెస్టయిన ఏలూరు పార్లమెంట్‌ ఇన్‌చార్జి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జోన్‌ కో–ఆర్డినేటర్‌ కారుమూరి సునీల్‌కుమార్‌ను చంచల్‌గూడ జైలులో ములాఖత్‌లో కలిశారు. మద్యం కుంభకోణం పేరుతో వైఎస్సార్‌సీపీ నేతలను భయపెట్టాలనే ఉద్దేశంతో అక్రమ కేసుల్లో ఇరికిస్తూ టీడీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారనీ, చట్టం మేరకు కోర్టుల్లో అక్రమ అరెస్టుగా నిర్ధారణ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే సునీల్‌కుమార్‌ జైలు నుంచి విడుదల అవుతారని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చి న హామీలను నెరవేర్చలేక కేవలం ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులను టార్గెట్‌ చేస్తూ అక్రమ కేసులను బనాయిస్తున్నారన్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ భయపెట్టాలని చూస్తే ఎవరూ బెదిరిపోరని స్పష్టం చేశారు. మరింత ధైర్యంతో ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామని జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌ స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావటం తఽథ్యమని, కూటమి ప్రభుత్వానికి సరైన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. వైఎస్సార్‌సీపీ చింతలపూడి సమ న్వయకర్త కంభం విజయరాజు, ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌, సోషల్‌ మీడియా రాష్ట్ర కార్యదర్శి వమ్మిశెట్టి పరమేశ్వరరావు, కామవరపుకోట మండల అధ్యక్షుడు రాయింకుల సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement