భీమవరం: విద్యాశాఖలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో సోమ వారం స్థానిక డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. భీమవరం విభాగ్ కన్వీనర్ కాయిత డిన్ను చందు మాట్లాడుతూ రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకుని పతనావ్యవస్థకు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్య సంస్థల్లో పుస్తకా లు, యూనిఫాంలను విక్రయించడమేగాక ఫీజు దోపిడీకి పాల్పడుతున్నారని, వీటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా నడుపుతున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్తాయిలో మౌలిక సదుపాయాలను కల్పనతో పాటు విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం డీఈఓ ఈ.నారాయణకు వినతిపత్రం అందజేశారు. ఏ బీవీపీ జిల్లా కన్వీనర్ రాయి వెంకట, భీమవరం ప ట్టణ ఉపాధ్యక్షుడు ప్రశాంత్, కార్య సమితి సభ్యులు ఆనంద్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు .


