భీమవరం: పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. గునుపూడిలోని గుల్లంకివారిపేటలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్కూల్‌లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం గుల్లంకివారిపేట, ఎంప్లాయీస్ కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. వెంటనే క్లీనింగ్ చర్యలు చేపట్టాలని, రోడ్లు, డ్రైనేజీ లేని ప్రాంతాల్లో కొత్త రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు తీసు కోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించా రు. మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, వైద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్) : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజ లు ఆన్‌లైన్‌లోనూ అర్జీలు నమోదు చేసుకోవ చ్చని, టోల్‌ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చని ఆమె సూచించారు. ముఖ్యంగా నడవలేని, మంచానికే పరిమితమైన, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పీజీఆర్‌ఎస్ కేంద్రాల వద్దకు తీసుకురావద్దని, అలాంటి వా రి సమస్యలను కుటుంబ సభ్యులు లేదా ప్ర తినిధుల ద్వారా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. అలాగే ప్రతి శుక్రవారం నియోజకవర్గస్థాయిలో నిర్వహిస్తున్న ప్రత్యేక పీజీఆర్‌ఎస్ కార్యక్రమాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తణుకు అర్బన్ : ప్రభుత్వాస్పత్రిలో రోగులకు నాణ్యమైన, సత్వర వైద్యసేవలు అందించేలా వైద్యులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. ఆదివారం తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిని ఆమె సందర్శించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసేవలను ఆరా తీశారు. ఆస్పత్రిలో ఓపీ, ప్రసవాలు, ఇత ర శస్త్రచికిత్సల సంఖ్య పెంచాలని సూచించా రు. డీసీహెచ్‌ఎస్ పగడాల సూర్యనారాయణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ కాకర్లమూడి సా యికిరణ్, ఆర్‌ఎంఓ ఎల్.సాయిబాలాజీ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
భీమవరం: కనీస వేతనాల చట్టం ప్రకారం ఐదేళ్లకోసారి వేతనాలను సవరించాలని, అయి తే 2006 నుంచి రాష్ట్రంలో వేతనాలను సవరించలేదని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూయు అనుబంధం) జిల్లా అధ్యక్షుడు మానుకొండ శివరావు అన్నారు. ఆదివారం స్థానిక సీఐటీ యూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీస వేతనాలను సవరించి తక్షణమే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పంచాయతీ కార్మికులు రూ.6 వేల నుంచి రూ.13 వేలు మాత్రమే వేతనాలు పొందుతున్నారని, చట్టప్రకారం కనీస వేతనాలను సవరిస్తే రూ.36 వేలు పొందేవారమన్నా రు. సన్మానాలు, సత్కారాలతో కార్మికుల కడు పు నిండదని, వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.ఆంజనేయులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కార్మికుల వద్దకు తీసుకువెళ్లడానికే వచ్చేనెలలో ఉద్యమం చేపడతామన్నారు. కిరణ్, రమణ తదితరులు పాల్గొన్నారు.


