ఏలూరులో నృత్యాంజలి కళానికేతన్ 33వ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం సంగీత, నృత్యార్చనలు ఘనంగా జరిగాయి. స్థానిక వైఎంహెచ్‌ఏ హాలులో కానాల గురుమూర్తి కళావేదికపై తపన ఫౌండేషన్, సంస్కార భారతి, హిందూ యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న కార్యక్రమాలు ముగిశాయి. ఆఖరిరోజు వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వందనీయ జననీ పేరిట ప్రదర్శనలు నిర్వహించారు. నాట్యాచార్య గండికోట రాజేష్ శిష్య బృందంలోని 150 మంది కళాకారులు నాట్య ప్రదర్శనలు ఇచ్చారు.
– ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)


