ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్
వీరవాసరం : రైతుల ఆహ్వానం మేరకు పరిశీలించేందుకు వెళ్లిన సీఆర్‌డీఏ రైతుల పరిరక్షణ క మిటీపై దాడులకు పాల్పడటం అమానుషమని ఎ మ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ రా ష్ట్ర శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడు కవురు శ్రీనివాస్ ఆదివారం తీవ్రంగా ఖండించారు. ఉండవల్లి ప్రాంతంలో అమరావతి రైతుల ఇబ్బందులు తెలుసుకోవడానికి వెళుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ గూండాలు దాడులు చేయడం హేయమన్నారు. రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయం బయటకు వస్తుందనే భయంతోనే టీడీపీ శ్రేణులు ఈ చర్యలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఉండవల్లిలో టీడీపీ నేత లు, కార్యకర్తలు, మట్టిమాఫియా, రౌడీషీటర్లు చేసిన దాడి ఘటన వెనుక బడా నాయకుల పాత్ర ఉందని ఆరోపించారు. రాళ్లు, కర్రలతో రెచ్చిపోవడం, కార్లను ధ్వంసం చేయడం కూట మి ప్రభుత్వ రాక్షస పాలనకు నిదర్శనంగా ఉందన్నారు. ఇటువంటి దాడులకు వైఎస్సార్‌సీపీ ఎన్నడూ భయపడదని, ప్రజలు రాబోయే కా లంగా కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆ ధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూనే ఉంటామని శ్రీనివాస్ పేర్కొన్నారు.
బుట్టాయగూడెం : ఏజెన్సీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం వర్షం దంచికొట్టింది. గిరిజన గ్రామాల్లో, గుబ్బల మంగమ్మ గుడి వద్ద కుండపోతగా వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో వంట పొయ్యిలు తడిసిపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. సుమారు రెండు గంటలకు పైగా వర్షం కురవడంతో ఎక్కడి సామాన్లు అక్కడ వదిలేసి వ్యాపార దుకాణాల షెడ్డుల్లోకి పరుగులు తీశారు. సాయంత్రానికి వర్షం తగ్గడంతో అక్కడి నుంచి భక్తులు బయటకు తరలివచ్చారు.


