కారుమూరి సునీల్‌ అరెస్ట్‌ దారుణం | - | Sakshi
Sakshi News home page

కారుమూరి సునీల్‌ అరెస్ట్‌ దారుణం

Jun 29 2026 1:53 AM | Updated on Jun 29 2026 1:53 AM

తణుకు అర్బన్‌ : వైఎస్సార్‌సీపీ ఏలూరు పార్లమెంట్‌ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్‌ను మద్యం కేసులో అక్రమ అరెస్ట్‌ చేసి జైలుకు పంపడం దారుణమని మాజీ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. మాజీ మంత్రి కా రుమూరి వెంకట నాగేశ్వరరావును మాజీ మంత్రి జోగి రమేష్‌ ఆదివారం హైదరాబాద్‌లో కలిసి పరామర్శించారు. చంద్రబాబు సర్కారు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు, విధ్వంస పాలనను ప్రశ్నిస్తున్న వారిపై రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయలేక డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో రోడ్డుపైకి వచ్చి నిలదీసే పరిస్థితి వస్తుందన్నారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా ధైర్యంగా ఉండాలని సునీల్‌కుమార్‌ నిజాయితీపరుడని, నిస్వార్థంగా రాజకీయాలు చేసే మనిషిగా ప్రజలకు తెలుసని కారుమూరితో అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement