కై కలూరు: అమ్మా.. కొల్లేటికోట పెద్దింట్లమ్మ చల్లంగా చూడమ్మా.. అంటూ భక్తులు ఆర్తీతో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్క రోజే ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశ ఖండన, పెద్ద, చిన్న తీర్ధాలు, లడ్డూ, గదుల అద్దెలు, వాహన పూజలు, అమ్మవారి చిత్రపటాల అమ్మకం, విరాళాల ద్వారా రూ.71,830 ఆదాయం వచ్చిందని తెలిపారు. ఆకివీడు గ్రామానికి చెందిన కంది ఓంకార్, అర్జున్ సోదరులు అమ్మవారికి 8 గ్రాముల రాణి కాసు బంగారంను బహుకరించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు దాతలను సన్మానించారు.


