అసభ్యకర వీడియోలతో బెదిరింపులు
అసభ్యకర వీడియోలు సృష్టించి వివాహితను బెదిరించిన వ్యక్తిని శనివారం నరసాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. 8లో u
కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేసి, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ శనివారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జూన్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు కార్యక్రమం కొనసాగుతుందని, ఆదివారం బూత్‌లలో పోలియో చుక్కలు వేయించుకోలేని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 1,74,756 మంది 0–5 ఏళ్ల వయస్సు గల చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 1,151 పోలియో బూత్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు 5,520 మంది అధికారులు, సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.
భీమవరం (ప్రకాశంచౌక్): పోలియోపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం భీమవరం ప్రకాష్ చౌక్ నుంచి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీని జేసీ రాహుల్‌కుమార్ రెడ్డిజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 28 నుంచి 30వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


