దళిత శంఖారావాన్ని జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

దళిత శంఖారావాన్ని జయప్రదం చేయాలి

Jun 28 2026 7:30 AM | Updated on Jun 28 2026 7:30 AM

దళిత శంఖారావాన్ని జయప్రదం చేయాలి

ఏలూరు (టూటౌన్‌): ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఏలూరులో జరిగే దళిత శంఖారావాన్ని జయప్రదం చేయాలని ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. ఏలూరులో శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్టికల్‌ 25 ప్రకారం.. ఒక మతాన్ని పాటించే హక్కు, ఒక మతాన్ని ప్రచారం చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉందన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు అనుచిత వాఖ్యలు చేయడం సరికాదన్నారు. భీమవరంలో అన్ని చర్చ్‌లు పడగొట్టడానికి పూనుకున్నారన్నారు. నెలకు రూ. 25 లక్షలు ప్రభుత్వం రఘురామకృష్ణరాజుకు ఖర్చు పెడుతుందని అదంతా రాష్ట్ర ప్రజల సొమ్మన్నారు. రెండు చెక్కల దేవుడు అని విమర్శించిన మీకు త్వరలో రాజకీయ సమాధి కట్టబోతున్నామని హెచ్చరించారు.ఆదివారం 33 డిమాండ్స్‌తో లక్షలాది మందితో ఏలూరులో మీటింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. మీరు క్షమాపణలు అడగకపోతే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళతామని హెచ్చరించారు. దళిత క్రైస్తవ సమర శంఖారావ సభకు భారీగా ప్రజలు తరలి వచ్చి సంఘీభావం తెలియజేయాలని కోరారు. సమావేశంలో చాగంటి సంజీవ్‌, నేతల రమేష్‌ బాబు, మెండెం సంతోష్‌ కుమార్‌, పల్లెం ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాది జడ శ్రవణ్‌ కుమార్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement