కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం

Jun 27 2026 12:19 AM | Updated on Jun 27 2026 12:19 AM

కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం రేపు భీమవరంలో ఫుట్‌బాల్‌ సెలె క్షన్స్‌ బయోకల్చర్‌పై శిక్షణ

కాళ్ల : మండలంలోని వేంపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామంలోని తమ్మా మోహనరావుకు చెందిన కొబ్బరి పీచు పరిశ్రమలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు చుట్టుపక్కల వ్యాపించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు భీమవరం నుంచి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వీఆర్వో షేక్‌ హుస్సేన్‌ లాల్‌ సంఘటనా స్థలాన్ని ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. దీనిపై పూర్తి నివేదికను తహసీల్దార్‌కు అందించనున్నట్లు వీఆర్వో పేర్కొన్నారు.

భీమవరం: ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక భారతీయ విద్యాభవన్‌ స్కూల్లో సబ్‌ జూనియర్‌, జూనియర్‌ డిస్ట్రిక్ట్‌ ఫుట్‌బాల్‌ సెలెక్షన్స్‌ నిర్వహిస్తున్నట్లు స్కూల్‌ ప్రిన్సిపల్‌ గౌరవశర్మ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ ఎంపికలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా స్కూల్‌ చైర్మన్‌ యుకే విశ్వనాథరాజు, సెక్రటరీ సామంతపూడి శ్రీరామ రాజు హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు.

బుట్టాయగూడెం : బయో కల్చర్‌ను అన్ని రకాల పంటల్లో వచ్చే పురుగులు, తెగుళ్ల నివారణకు సమర్థవంతంగా ఉపయోగించవచ్చని ప్రకృతి వ్యవసాయశాఖ ట్రైనింగ్‌ అసోసియేటివ్‌ డి.మధుబాబు అన్నారు. మండలంలోని బండార్లగూడెంలో ప్రకృతి వ్యవసాయంలో సుస్థిర సాగు విధానాన్ని ప్రోత్సహించే దిశగా రైతులు, స్వయం సంఘాల మహిళలకు బయో కల్చర్స్‌ తయారీ, వాటి వినియోగం, ప్రాముఖ్యతపై శుక్రవారం శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బయో కల్చర్‌ను రైతులే తక్కువ ఖర్చుతో స్వయంగా తయారు చేసుకుని వినియోగించడం ద్వారా సాగు వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంతోపాటు పంటల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎన్‌ఎఫ్‌ సిబ్బంది, ఫార్మర్‌ మాస్టర్‌ ట్రైనర్స్‌ ఎన్‌.శ్రీను, కె.చలపతి, జీఎస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement