దళిత శంఖారావాన్ని విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

దళిత శంఖారావాన్ని విజయవంతం చేయాలి

Jun 27 2026 12:19 AM | Updated on Jun 27 2026 12:19 AM

ఏలూరు (టూటౌన్‌) : నగరంలోని విద్యానగర్‌లో ఉన్న సెయింట్‌ జేవియర్స్‌ హైస్కూల్‌ గ్రౌండ్స్‌లో ఆదివారం సాయంత్రం 4 గంటలకు భారీ ఎత్తున నిర్వహించే దళిత క్రైస్తవ సమర శంఖారావాన్ని జయప్రదం చేయాలని మాజీ న్యాయమూర్తి, హైకోర్టు అడ్వకేట్‌ జై భీమ్‌ భారత్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడ శ్రావణ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలో శుక్రవారం దళిత క్రైస్తవ సమర శంఖారావం కార్యక్రమానికి సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో దళిత క్రైస్తవులపై అనేక దాడులు జరుగుతున్నాయని, మత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని, అనేక క్రైస్తవ చర్చిలను కూలదోస్తు్‌ాన్నరని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈ క్రైస్తవ సమర శంఖారావాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఆర్‌ఎస్‌ మాజీ అధికారి చాగంటి సంజీవ్‌, నేతల రమేష్‌ బాబు, జక్కుల బెనర్జీ, డాక్టర్‌ మెండెం సంతోష్‌ కుమార్‌, పళ్లెం ప్రసాద్‌, దాసరి నాగేంద్ర కుమార్‌, పెరికే వరప్రసాద్‌, గొల్లా నరేష్‌ తదితరు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement