సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు

Jun 27 2026 12:19 AM | Updated on Jun 27 2026 12:19 AM

తలకెక్కించుకోకపోతే ప్రాణాపాయం సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు

తలకెక్కించుకోకపోతే ప్రాణాపాయం
హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని తెలిసినా, కొందరు వాహన చోదకులు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. 8లో u

భీమవరం: సాగు, తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా జలవనరుల శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అఽధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జలవనరుల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాలోని ప్రధాన కాలువలు, డ్రెయిన్లు, నీటి పారుదల వ్యవస్థ నిర్వహణ, వర్షాకాల పరిస్థితులు, సాగు నీటి లభ్యత, తాగునీటి సరఫరా తదితర అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరసాపురం పరిధిలోని డ్రెయిన్లకు సంబంధించిన సమస్యలను అత్యవసర ప్రాతిపదికన గుర్తించి, తక్షణమే పరిష్కారించాలన్నారు. కోనాయకోడు, దర్భరేవులకు సంబంధించిన ప్రతిపాదనలను ఆలస్యం చేయకుండా సిద్ధం చేసి వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. మురుగు కాలువలు, సాగునీటి కాలువల్లో పేరుకుపోతున్న గుర్రపు డెక్క, తూడు వంటి అవరోధాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాగునీటి పంపిణీతోపాటు తాగునీటి వనరుల పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement