తాడేపల్లిగూడెం: పారదర్శకమైన ఓటర్ల జాబితాను తయారుచేయడానికి జరుగుతున్న ప్రక్రియ సర్ అని, సర్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం పట్టణంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి బీఎల్‌ఓలు చేపడుతున్న సర్వేను పరిశీలించారు. ఓటర్లతో నేరుగా మాట్లాడి ఎన్‌రోల్‌మెంట్ ఫారాలు అదాయా లేదా అని తెలుసుకున్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సర్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల వివరాలను 2002 నాటి ఓటర్ల జాబితాతో సరిపోల్చి మ్యాపింగ్ చేస్తున్నామన్నారు. జిల్లాలో సుమారు 70 శాతం వరకు మ్యాపింగ్ పూర్తయ్యిందన్నారు. పట్టణాలు, గ్రామాల్లో 99 శాతం మ్యాపింగ్ పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారన్నారు. ఫారాల పంపిణీ కూడా 90 శాతం పూర్తయ్యిందన్నారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. బీఎల్‌ఏల పాత్ర గృహాలను గుర్తించడం, వ్యక్తులను గుర్తించడంలో సహకరించడం వరకే అన్నారు. జూన్ 15న ప్రారంభమైన జులై 14తో ముగుస్తుందన్నారు. సర్వే, డేటా సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.


