న్యూస్‌రీల్
ఆక్వా వ్యవస్థ కుదేలు
మద్దతు ధర ప్రకటించాలి
రొయ్య రైతులు మరో పోరుబాటకు సిద్ధమయ్యారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు ఎలాంటి సంప్రదింపులు, సమావేశాలు నిర్వహించకుండా అడ్డగోలుగా ధరలు పెంచడంపై రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం భగ్గుమంది. కిలో మేతకు రూ.12 నుంచి రూ.14కు పెంచడం వలన ప్రతి రైతుపై లక్షల్లో అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యలకు గిట్టుబాటు ధర లేని తరుణంలో ఇలా మేత ధరలు పెంచడం ఆక్వా రంగంలో తీవ్ర సంక్షోభానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో వచ్చే వారం నుంచి నిరసన కార్యక్రమాలతో కార్యాచరణ ప్రారంభించనున్నారు.
శురకవారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 2.63 లక్షల ఎకరాలు ఆక్వా సాగు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగులో సింహభాగం రాష్ట్ర ఉమ్మడి పశ్చిమలోనే ఉంది. కాల్వ, సముద్రనీళ్లు రెండూ ఉండటంతో ఆక్వా సాగుకు జిల్లా అత్యంత అనుకూలంగా ఉంది. ఈ క్రమంలో జిల్లాలో సాగు విస్తీర్ణంతో పాటు 25కు పైగా ఆక్వా ప్లాంట్లు, ఫీడ్ కంపెనీలు, వందలాది ఐస్ ఫ్యాక్టరీలు ఇలా ఆక్వాకు సంబంధించి పెద్ద వ్యవస్థే జిల్లాలో కొనసాగుతూ ఏటా వేల కోట్ల రూపాయల టర్నోవర్‌తో వ్యాపారం కొనసాగుతుంది. ఈ క్రమంలో గత కొద్ది నెలలుగా ఆక్వా ధరలు నానాటికి పతనమవుతున్నాయి. 100 కౌంట్ కిలో ధర ఈ నెల ప్రారంభంలో రూ.265 ఉండగా మేత ధరలు పెరిగిన తరువాత రూ.210 నుంచి 230కు చేరింది. ఆక్వా ధరలు ఎగుమతి మార్కెట్ బాగాలేదని, ఇతర కారణాలతో రోజురోజుకు తగ్గుతున్నాయి.
క్రాప్ హాలిడే దిశగా అడుగులు
ఇప్పటికే ధరల పతనంతో ఉమ్మడి పశ్చిమలో క్రాప్ హాలిడే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో మేత ధరల పెంపు అదనపు భారమైంది. దీంతో కంపెనీలు పెంచిన ధరలు తగ్గించేవరకు సాగు చేయమని, మేత ధరల కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలంటూ నినదించారు. ఈ క్రమంలో ఆక్వా రైతులు, ఫీడ్ కంపెనీలు, ప్లాంట్ల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రకటించాయి. అయితే సర్కారు సీరియస్‌గా తీసుకోకపోవడంతో ఈనెల 16న ఆక్వా రైతులు అన్ని జిల్లాల్లో తహసీల్దార్ కార్యాలయాల వద్ద, కలెక్టరేట్‌ల వద్ద నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి వినతిపత్రాలు అందచేశారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం రూ.12 నుంచి రూ.14 పెరిగిన మేత ధరను కిలో రూ.4 తగ్గిస్తున్నట్లు ప్రకటించి వెంటనే అమల్లోకి వస్తుందన్నారు. అయితే సర్కారు మాట ఫీడ్ కంపెనీలేమి ఖాతరు చేయని పరిస్థితి. కేవలం 2 రూపాయలు మాత్రమే తగ్గిస్తున్నట్లు కంపెనీలు ప్రకటించడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కంపెనీలు రూ.2 తగ్గించి చేతులు దులుపుకోవడంతో మళ్లీ రైతులు ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. తాజా పరిణామాల క్రమంలో గురువారం పశ్చిమగోదావరి జాయింట్ కలెక్టర్ రైతులతో సమావేశం నిర్వహించారు. పెంచిన ధర పూర్తిగా తగ్గించాలని, అదే విధంగా సమావేశాలకు ఆక్వా ప్లాంటు ప్రతినిధులను కూడా పిలవాలని డిమాండ్ చేశారు. మరోవైపు శనివారం సమావేశం నిర్వహించి సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలు అన్ని మండలాల్లో నిర్వహించాలని సన్నద్ధమయ్యారు. కేవలం ఫీడ్ పెంపు వల్ల ఒక సీజన్‌లో జిల్లా రైతాంగంపై రూ.630 కోట్లు అదనపు భారం కానున్నాయి.
ఆక్వా మేత ధరలు తగ్గించాలి
రొయ్యలకు మద్దతు ధర ఇవ్వాలి
సిండికేట్ల మాయాజాలం
సహించం
నినదిస్తూ.. నిలదీస్తూ..
మరోసారి ఉద్యమానికి ఆక్వా రైతులు సన్నద్ధం
మేత ధరలపై మండిపాటు
ధరలు తగ్గిస్తున్నట్టు సర్కారు ప్రకటించినా అమలు కాని వైనం
ఆక్వా ప్లాంట్ల సిండికేట్ మాయజాలంలో బలవుతున్న రైతులు
ఉమ్మడి జిల్లాలో 2.63 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు
ధర పెంపుతో ప్రతి రైతు నెత్తిన రూ.5 లక్షల వరకు భారం
ఏఐ సృష్టించిన చిత్రం
కూటమి ప్రభుత్వం రాకతో ఆక్వా రంగం కనుమరుగవుతున్న పరిస్థితి. ఆక్వాఫీడ్‌ల ధరలు భారీగా పెరగడంతో ఆక్వా వ్యవస్థ కుదేలవుతుంది. ధరల పెంపు కారణంగా ఆక్వా రంగం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
– మలిరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి,
నందివాడ మండల రైతు సంఘం విభాగ అధ్యక్షుడు
ఆక్వా రైతు సమస్యల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ప్రభుత్వ సబ్సిడీలు ఇతర పథకాలు రొయ్యల రైతులకు నేరుగా అందజేయాలి. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అప్సడా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు పరుస్తూ, ఆక్వా రైతుల సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపించారు. ప్రస్తుతం రొయ్యల మేతల ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తూ.. రొయ్యల ధరలు మాత్రం తగ్గిస్తూనే ఉన్నారు. రొయ్యల రైతులకు ఎప్పుడు కష్టాలే మిగులుతున్నాయి.
– దాసరి మాణిక్యాలరావు, రొయ్యల రైతు, చింతలకోటిగరువు


