ఊడిన స్కూల్ బస్సు చక్రం
టి.నరసాపురం మండలంలోని బొర్రంపాలెం నుంచి వీరభద్రవరం వెళ్లే రహదారిలో గురువారం జంగారెడ్డిగూడేనికి చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు ముందు టైరు ఊడిపోయింది. 8లో u
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా వివాహ సంబంధాల పేరుతో మహిళలను నమ్మిస్తూ, వారి నుంచి నగదు, బంగారం కాజేస్తున్న ఒక అంతర్రాష్ట్ర నేరగాడిని ముదినేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏలూరు ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ గురువారం జిల్లా కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గుంటూరు జిల్లా పాండురంగనగర్‌కు చెందిన వక్కలగడ్డ సాంబశివరావు (36) అనే వ్యక్తి తాను ఒక మీడియా సంస్థలో సీఈఓగా పనిచేస్తున్నానని, ఆస్ట్రేలియాలో సోదరి ఉందని, తల్లిదండ్రులు ఉన్నత ఉద్యోగులని అబద్ధాలు చెబుతూ మహిళలను నమ్మించేవాడు. ఇలా 2020 నుంచి ఇప్పటివరకు సుమారు 40 మందికిపైగా మహిళలను మ్యాట్రిమోని వెబ్‌సైట్ల ద్వారా పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి వారి నుంచి నగదు, బంగారాన్ని దోచుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇటీవల ముదినేపల్లి మండలానికి చెందిన ఒక మహిళను నమ్మించి, ఆపై ఆమెను బెదిరించి పది కాసుల బంగారం, రూ.లక్ష నగదు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే తరహాలో తెలంగాణలోని కోదాడకు చెందిన జ్యోతి, జంగారెడ్డిగూడేనికి చెందిన రాజ్యలక్ష్మి, పరవాడకు చెందిన దుర్గ భవానీ తదితర మహిళలను కూడా మోసం చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.
సాంకేతిక పరిజ్ఞానంతో..
ఈ కేసులో ముదినేపల్లి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, స్థానిక సమాచారాన్ని విశ్లేషించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నేరస్తుడి నుంచి సుమారు 8 కాసుల బంగారు ఆభరణాలు, ఆరు సెల్‌ఫోన్లు, 10 సిమ్ కార్డులు, కారు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ఉత్తమ పనితీరు కనబరిచిన కై కలూరు రూరల్ సీఐ వి.రవికుమార్, ముదినేపల్లి ఎస్సై వీఎస్‌వీ భద్రరావు, సిబ్బంది బి.పెద్దిరాజు, పీవీ సత్యనారాయణ, బి.నాగబాబు, పి.పవన్‌కుమార్, జి.శివకోటయ్యలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


