● పసుపు కప్పల సందడి | - | Sakshi
Sakshi News home page

● పసుపు కప్పల సందడి

Jun 26 2026 7:27 AM | Updated on Jun 26 2026 7:27 AM

● పసుపు కప్పల సందడి

ఆడకప్పలను ఆకర్షించడానికి కేవలం వర్షాకాలంలో ఒంటిని పసుపు రంగుగా మార్చుకునే కప్ప ఒకటుందని మీకు తెలుసా? దీని పేరు ఇండియన్‌ బుల్‌ ఫ్రాగ్‌. తెలుగులో తవుడు, బోదరు కప్పలు అని పిలుస్తారు. ఇటీవల వర్షాలు పడటంతో ఏలూరు జిల్లా కై కలూరు టౌన్‌హాలు గ్రౌండ్‌లో చేరిన నీటిలోంచి గురువారం ఇవి బయటకు వచ్చాయి. మగ కప్పలు రెండు స్వరపేటికలను నీలం రంగులోకి మార్చుతూ వింత శబ్ధాలు చేయడంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. బుల్‌ ఫ్రాగ్‌ శాసీ్త్రయనామం హూప్లోచాట్రాసస్‌ టైగిరినస్‌. ఇవి 17 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. వర్షాకాలంలో జతకట్టే సమయం ముగియగానే సాధారణ రంగులోకి వస్తాయి. వీటి సంతతి నానాటికీ తగ్గడంపై

జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. – కై కలూరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement