స్వర్ణ వస్త్ర నిధి ప్రత్యేక కౌంటర్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

స్వర్ణ వస్త్ర నిధి ప్రత్యేక కౌంటర్‌ ప్రారంభం

Jun 26 2026 7:27 AM | Updated on Jun 26 2026 7:27 AM

స్వర్ణ వస్త్ర నిధి ప్రత్యేక కౌంటర్‌ ప్రారంభం

భీమవరం (ప్రకాశంచౌక్‌): పట్టణంలోని శ్రీ మావుళ్లమ్మ వారి దేవస్థానంలో అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం ప్రాజెక్ట్‌ ద్వారా భక్తుల నుంచి బంగారం విరాళంగా సేకరించే నిమిత్తం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌ను గురువారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు దంపతులు ప్రారంభించారు. తొలిగా వారి సమీప కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చెందిన బి.నరసింహారావు పేరు మీద రూ.1.50 లక్షల నగదు కానుకగా అందించారు. ముందుగా అమ్మవారి స్వర్ణవస్త్ర నిధి కమిటీ సభ్యులు, ధర్మకర్తలు అమ్మవారి కి ప్రత్యేక విశేష పూజలు చేశారు. అనంతరం భీమవరానికి కట్టా వెంకటేశ్వరరావు 4 గ్రాముల బంగారం, టి.వెంకట కృష్ణ గుప్తా రామకృష్ణమూర్తి దంపతులు రూ.11,116, దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ బుద్ధ మహాలక్ష్మి నగేష్‌ రూ.1500 కానుకగా సమర్పించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ, మాజీ సభ్యురాలు తోట సీతామహాలక్ష్మి, దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, చైర్మన్‌ బొండాడ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement