సీబీఐ విచారణకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

సీబీఐ విచారణకు డిమాండ్‌

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

సీబీఐ విచారణకు డిమాండ్‌ స్పోర్ట్స్‌ కోటా ఎలా ఇస్తారు

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎటువంటి అనుమానాలు, అపోహలకు తావు లేకుండా ఒకేసారి 1.36 లక్షల ఉద్యోగాలు ఇస్తే.. డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం 3.5 లక్షల మందికి పరీక్షలు నిర్వహించడంలో ఘోరంగా విఫలమైంది. పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సీబీఐతో విచారణ జరిపించాలి.

– గోపి జాన్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి

డీఎస్సీ నిర్వహణలో స్పోర్ట్స్‌ కోటా అంటూ ప్రత్యేకంగా ప్రకటించలేదు. ఉద్యోగాలు ఇచ్చే సమయంలో స్పోర్ట్స్‌ కోటాలో 421 మందికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారు. జీఓలో పలుమార్లు మార్పు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది. ఎన్నికల హామీల మాదిరిగా నిరుద్యోగులను మోసం చేయాలని చూస్తే ఊరుకోబోం. డీఎస్సీ అక్రమాలు సరిచేసే వరకూ ఉద్యమం చేస్తాం.

– అద్దంకి ప్రసాద్‌, ఆకివీడు

Advertisement
 
Advertisement
Advertisement