తణుకు అర్బన్ : దువ్వ గ్రామంలోని మాంసం దుకాణం వద్ద తలెత్తిన తగాదాలో ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడు లు చేసుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రా త్రి జరిగిన ఈ దాడిలో గ్రామానికి చెందిన కోసూరి సతీష్, గాడ దానేశ్వరావులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిద్దరినీ తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇద్దరూ చికెన్ దుకాణంలో మాంసం కొట్టేవారమని బాధితులు చెప్పగా, పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘర్షణ జరిగినట్టు తణుకు రూరల్ పోలీసులు చెబుతున్నారు. పరస్పరం ఇద్దరు ఇచ్చి న ఫిర్యాదుల మేరకు తణుకు రూరల్ ఇన్‌చార్జి ఎస్సై జానా సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


