దగా డీఎస్సీపై యువత పోరు | - | Sakshi
Sakshi News home page

దగా డీఎస్సీపై యువత పోరు

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

దగా డీఎస్సీపై యువత పోరు

గళమెత్తిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

భీమవరంలో నిరసన

కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేత

భీమవరం: లక్షలాది ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ ఎన్నికల్లో హామీలిచ్చిన కూటమి నాయకులు మెగా డీఎస్సీ పేరుతో యువతను తీవ్రంగా దగా చేశారని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నా యకులు మండిపడ్డారు. మెగా డీఎస్సీలో అక్రమా లు, అవినీతికి నిరసనగా సోమవారం భీమవరం అంబేడ్కర్‌ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ యువత పోరు పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా నిరుద్యోగభృతి మాట మర్చిపోగా డీఎస్సీ పేరుతో లక్షలాది మంది యువతకు తీవ్ర అన్యాయం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులతో కూటమి ప్రభుత్వానిది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ, డీఎస్సీలో జరిగిన భారీ స్కామ్‌కు విద్యాశాఖ మంత్రి లోకేష్‌, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తక్షణం రాజీనామా చేయాలంటూ.. నినాదాలు చేశారు. చేతకాని ప్రభుత్వం నిర్వాకం వల్లే డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, ర్యాంకర్స్‌ను పక్కన పెట్టి ఇష్టమొచ్చిన వారికి స్పోర్ట్స్‌ కోటా అంటూ ఉద్యోగాలను అమ్ముకున్నా రని ఆరోపించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో చేరిన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకులు, దగా పడ్డ డీఎస్సీ అభ్యర్థులు, ప్రజలు నిరసన అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్‌లో జరిగిన ప్రజాసమస్యల పరి ష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణికి అందజేశారు. వైఎస్సార్‌సీపీ యువజన వి భాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవ రాజేష్‌, రాష్ట్ర కార్యదర్శి ద్వారంపూడి ప్రేమ్‌కిరణ్‌రెడ్డి, భీమవరం పట్టణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, భీమవరం, నరసాపురం, తణుకు, ఉండి, ఆచంట నియోజకవర్గాల అధ్యక్షులు దాయం ప్రకాష్‌, చినమిల్లి చందు, కొత్తపల్లి చరణ్‌, సుబ్బు, సునీల్‌, దేవా రాజేష్‌, గుంటి ప్రభు, పెనుమాల సురేష్‌ తది తరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement