4 నుంచి ‘బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ | - | Sakshi
Sakshi News home page

4 నుంచి ‘బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

భీమవరం: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 4 నుంచి 12 వరకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు మాజీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ నాయకులు అంబటి రాంబాబు, కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం భీమవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు నివాసంలో వెన్నుపోటుకు రెండేళ్లు బ్రోచర్‌ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారని వా టిని రెండేళ్లు గడిచినా అమలు చేయకపోవడంతో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. 4న అన్ని మండల కేంద్రాలు, ప్రధాన కూడళ్లలో టీడీపీ మేనిఫెస్టో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సంతకాలు చేసిన బాండ్లు, పత్రికా ప్రకటన కాపీలను దహనం చేస్తామన్నారు. 8, 9వ తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో టౌ న్‌హాల్‌ సదస్సులు నిర్వహిస్తామని, 12న రా ష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమేగాక ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి ఇవ్వ ని హామీలను కూడా అనేకం చేపట్టారని, అయితే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా ప్ర జలను దగా చేశారని ఆరోపించారు. కూ టమి ప్రభుత్వానికి కళ్లు తెరిపించేందుకే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టామని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్‌చార్జి చినమిల్లి వెంకటరాయుడు, పార్టీ నరసాపురం పార్లమెంట్‌ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, భీమవరం పట్టణాధ్యక్షుడు గాదిరాజు రామరాజు, ఇంటి సత్యనారాయణ, గంటా రాహుల్‌, కనమూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసనలు

Advertisement
 
Advertisement
Advertisement