భీమవరం (ప్రకాశంచౌక్) : భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్‌లో 194 అర్జీలు స్వీకరించినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి ఎ.వెంకటలక్ష్మి కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్.వెంకటేశ్వరరావుతో కలిసి ఆమె అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీకి నిర్ణీత గడువులోపు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో 156 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్‌లో 38 దరఖాస్తులు స్వీకరించారు.
రూ.96.77 కోట్ల పింఛన్ల పంపిణీ
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కింద రూ.96.77 కోట్లు పంపిణీ చేసినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. భీమవరంలోని 16వ వార్డు అయ్యవారి వీధిలో సోమవారం ఆమె లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్‌ఎస్ వేణుగోపాల్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఎ.రాంబాబు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా లో యోగాంధ్ర–2026 కార్యక్రమాలను ఈనెల 7 నుంచి 21 వరకు నిర్వహించనున్నామని కలెక్టర్ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ ఈ కార్యక్రమ నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. 13న నరసాపురం వలంధర రేవు ప్రాంగణంలో, 14న వాసవి పెనుగొండలో వాసవి కన్యకా పర మేశ్వరీ దేవస్థానం ప్రాంగణంలో 500 మందితో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు.


