కాలువలు అధ్వానం.. ప్రవాహం ప్రశ్నార్థకం | - | Sakshi
Sakshi News home page

కాలువలు అధ్వానం.. ప్రవాహం ప్రశ్నార్థకం

Jun 1 2026 1:02 AM | Updated on Jun 1 2026 1:02 AM

ప్రతిపాదనలతో సరి..

భీమవరం (ప్రకాశం చౌక్‌) : తాగు, సాగునీరందించే కాలువలు, మురుగు నీటిని తరలించే డ్రెయిన్ల అభివృద్ధిపై పాలకులు దృష్టి సారించడం లేదు. ఏటా వేసవిలో చేపట్టాల్సిన పనులు అరకొరగానే జరుగుతున్నాయి. దీంతో జిల్లాలో పంట కాలువలు, డ్రెయిన్లు పూడుకుపోవడంతో పాటు ఆక్రమణలకు గురవుతున్నాయి. కాలువ పనులు అంతంతమాత్రంగా ఉండటంతో నీటి ప్రవాహం ప్రశ్నార్థకంగా మారింది. శివారు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో నీరందడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గోదావరి నుంచి కాలువలకు నీరు వదులుతున్నా కింది ప్రాంతాలకు చేరడం లేదు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కాలువ అభివృద్ధి పనులు నామమాత్రంగానే జరిగాయి. ఆదివారం కాలువలకు నీరు విడుదల చేశారు.

దెబ్బతిన్న స్లూయిజ్‌లు

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రధాన పంట కాలువల లాకుల దెబ్బతిన్నాయి. లాకు తలుపులు తు ప్పుపట్టినా మరమ్మతులు చేపట్టడం లేదు. అలాగే బ్రాంచ్‌ కెనాల్స్‌కు ఉండే స్లూయిజ్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కనీసం మరమ్మతులు లేవు. లాకులు, స్లూయిజ్‌లు దెబ్బతినడంతో సాగునీరు వృఽథా అవుతోంది. దీంతో రైతులు స్వచ్ఛందంగా పనులు చేపట్టాల్సి ఉంటుంది.

డంపింగ్‌ యార్డ్‌లుగా డ్రెయిన్లు

జిల్లాలోని మేజర్‌, మైనర్‌ డ్రెయిన్లు డంపింగ్‌యార్డ్‌లుగా మారాయి. గట్లు దెబ్బతిని కాలువలోకి జా రిపోవడం, ఆక్రమణాలకు గురవుతున్నాయి. ఇందుకు భీమవరం రాయలం డ్రెయిన్‌ నిదర్శనంగా నిలుస్తోంది. ఈ డ్రెయిన్‌ గట్లు చెత్తతో నిండిపోయాయి. వేసవిలో డ్రెయిన్‌ పూడికతీత, తూడు తొలగింపు పనులను ప్రభుత్వం చేపట్టలేదు. దీంతో వర్షాకాలంలో మురుగునీరు కిందకు పారక పొలాలు మంపు బారినపడుతున్నాయి.

నీటి సంఘాలు ఎందుకు?

కూటమి ప్రభుత్వం తమ నాయకులు, కార్యకర్తలతో నీటి సంఘాలను ఏర్పాటుచేసింది. అయితే కాలువలు, డ్రెయిన్ల అభివృద్ది పనులపై వీరు దృష్టి సారించడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. నీటి సంఘాల డైరెక్టర్లు కనీసం పంట బోదెలను కూడా బాగుచేయించలేని స్థితిలో ఉన్నారని అంటున్నారు.

ఇరిగేషన్‌ మంత్రి ఉన్నా..

జిల్లాలో ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నా కాలువలు, డ్రెయిన్లు అభివృద్ధికి నోచుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నా యి. ఆయన శాఖకు చెందిన పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని అంటున్నారు. కేవలం మంత్రి సొంత నియోజకవర్గంలోనే పనులు చేపట్టి మిగిలిన ప్రాంతాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

వేసవిలో కాలువల అభివృద్ధి పనులు శూన్యం

అరకొర పనులతో సరి

స్లూయిజ్‌లకు మరమ్మతులు లేవు

కూటమి పాలనలో రెండేళ్లుగా ఇదే తంతు

కాలువలకు నీరు విడుదల

ఏటా వేసవిలో పంట కాలువలు, డ్రెయిన్ల అ భివృద్ధి పనుల కోసం ఇరిగేషన్‌, డ్రెయినేజీ శాఖల అధికారులు ప్రతిపాదనలు సమర్పిస్తున్నారు. కలెక్టరేట్‌ అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి నిధులు మంజూరయ్యాయని, పనులు చేపట్టాలని చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పనులు జరగడం లేదు. ఈలోపు కాలువలకు నీరు విడుదల చేయడం, పనులు నిలిచిపోవడం పరిపాటిగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement