తణుకు అర్బన్: పాత గొడవలతో దాడి చేయగా యువకుడు మృతిచెందాడు. తణుకు రాజీవ్ చౌక్ ప్రాంతంలోని అరుంధతీపేటలో నివసిస్తున్న ఇరువర్గాల మధ్య జరిగిన దాడిలో ఉందుర్తి అబ్బులు అలియాస్ ఎలీసా (36) తీవ్రగాయాలై ఆస్పత్రిలో కన్నుమూశాడు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలీషా తన ముగ్గురు సోదరులతో కలిసి తేతలి జాతీయ రహదారికి సమీపంలోని బీఫ్ బిర్యానీ పాయింట్ నడుపుతున్నాడు. కొంతకాలం క్రితం బిర్యానీ సెంటర్ వద్ద నెలకొన్న ఘర్షణతో పగబట్టిన అరుంధతీపేటలో అదే ప్రాంతంలో నివసించే మల్లిపూడి ప్రదీప్ అనే వ్యక్తి మృతుడి నివాస ప్రాంతానికి సమీపంలోనే మరో ము గ్గురుతో కలిసి ఆదివారం ఘర్షణకు దిగాడు. తొ లుత మృతుడి సోదరుడు చంటిపై దాడికి దిగగా అడ్డు వచ్చిన ఎలీషాను చాకుతో తీవ్రంగా గాయపరిచారు. గుండెకు సమీపంలో చాకుతో పొడవడంతో తీవ్ర రక్తస్రావమై ఆస్పత్రిలో చికిత్స పొందు తూ ఎలీసా మృతిచెందాడు. మృతుడి సోదరులు చంటి, చిన్నలకు స్వల్పగాయాలయ్యాయి. తణు కు పట్టణ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ వెంకటరమణ, రూరల్ ఇన్‌చార్జ్ ఎస్సై జానా సతీష్‌లు ఘటన జరిగిన ప్రాంతంతోపాటు ఆస్పత్రిలో విచారణ చేశారు.
ఉద్రిక్తతగా మారిన వైనం
దాడి నేపథ్యంలో మృతుడి స్నేహితులు, బంధువులు భారీస్థాయిలో ఆస్పత్రికి చేరుకోవడంతో ఓ స మయంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసు కుంది. పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప రిస్థితిని చక్కదిద్దారు. మృతుడి ఎలీషా అందరితో నూ కలుపుగోలుగా ఉండే వ్యక్తి అని బిర్యానీ పా యింట్‌తోపాటు డ్రైవింగ్‌లో కూడా ఉపాధి పొందున్నాడని సన్నిహితులు అంటున్నారు. పక్కా ప్రణాళికలో భాగంగానే దాడిచేసి చంపినట్టుగా బాధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మరో ఇద్దరికి గాయాలు


