ఏపీ నిట్‌.. ఉన్నత విద్యకు మెట్టు | - | Sakshi
Sakshi News home page

ఏపీ నిట్‌.. ఉన్నత విద్యకు మెట్టు

Jun 1 2026 1:02 AM | Updated on Jun 1 2026 1:02 AM

ఏపీ నిట్‌.. ఉన్నత విద్యకు మెట్టు

తాడేపల్లిగూడెం: జాతీయ ఉన్నత విద్యకు వేదికలు నిట్‌, ఐఐటీలు. ఇక్కడ సీటు సాఽధించడం విద్యార్థుల కల. సాధారణ ఇంజనీరింగ్‌ విద్యకు భిన్నంగా, స మాజానికి ఉపయుక్తంగా ఉండే కోర్సులు నిట్‌లలో ఊపిరిపోసుకుంటాయి. దేశంలో 31వ నిట్‌గా 2015లో తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌ ఏర్పాటయ్యింది. బీటెక్‌, ఎంటెక్‌, ఎంఎస్‌ బై రీసెర్చ్‌, పీహెచ్‌డీ ఫుల్‌టైం, పార్ట్‌టైం కోర్సులతో విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడినా ఇక్కడ చదివితే కొలువుకు ఢోకా ఉండదనే భరోసా ఉంది. ఏపీ నిట్‌ ఎన్‌ఆర్‌ఐఎఫ్‌ ర్యాకింగ్‌కు అర్హత సాధిస్తోంది. 2025లో 200–250 బ్యాండ్‌లో ఏపీ నిట్‌ ఉంది. ఈ జూన్‌కు కొత్త ర్యాంకును అధికారికంగా ప్రకటించనున్నారు. శాశ్వత ఫ్యాకల్టీల ఆధారంగా, సీట్‌ మ్యాట్రిక్స్‌ను ప్రామాణికంగా తీసుకుని కోర్‌ సబ్జెక్టులకు తరగతికి 90 మంది విద్యార్థులు, బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌ తరగతులకు 30 మంది విద్యార్థులను ఉంచుతున్నారు. శాశ్వత ప్రాతిపదికన ఫ్యాకల్టీల నియామక ప్రక్రియ పూర్తికాకపోవడంతో, గతంలో ఇక్కడి కొందరు అధికారుల నిర్వాకం వల్ల కోల్పోయిన 240 సీట్లను తిరిగి తెచ్చుకునే అవకాశం లేకుండా పోయింది.

శాశ్వత భవనాలు.. అధునాతన వసతులు

ఏపీ నిట్‌లో 480 సీట్లు ఉన్నాయి. వీటిలో హోంస్టేట్‌ కోటా కింద ఏపీ విద్యార్థులకు 240, దేశంలోని మి గిలిన రాష్ట్రాల విద్యార్థులకు 240 సీట్లు కేటాయించారు. బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌, సివి ల్‌ ఇంజనీరింగ్‌, సీఎస్‌ఈ, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఈసీఈ, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మెటలర్జికల్‌, మె టీరియల్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లు ఇక్కడ ఉన్నాయి. 127 మంది ఫ్యాకల్టీలు, ప్రస్తుతం 2,310 మంది విద్యార్ధులు, 120 మంది స్టాఫ్‌, 250 మంది స్కాలర్స్‌ ఉన్నారు. ఇన్‌చార్జి డైరెక్టర్‌ పాలనే ఇంకా కొనసాగుతుండటంతో 2024లో పూర్తి కావాల్సిన ఫ్యాకల్టీల ఎంపిక కార్యక్రమం పూర్తికాలేదు. దీంతో గతంలో కోల్పోయిన 240 సీట్లు రాలేదు. ఏపీ నిట్‌కు శాశ్వత భవనాలు ఉన్నాయి. మౌలిక వస తులు, ల్యాబ్‌ భవనం, సెంట్రల్‌ లైబ్రరీ, రవీంద్ర భారతి ఆడిటోరియంతో పాటు 11 ఏళ్ల కాలంలో 20 ఎంఓయూలను వివిధ సంస్థలతో ఏపీ నిట్‌ కు దుర్చుకుంది. ఆర్‌ అండ్‌ డీ ప్రాజెక్టులు ఏడు వచ్చా యి. 15 కన్సల్టెన్సీల ప్రాజెక్టులు దక్కాయి. ఓఎస్‌ఐఆర్‌ ప్రాజెక్టు కింద రూ.7.15 కోట్ల ప్రాజెక్టులు ద క్కాయి. 2025లో 510 మంది విద్యార్థులకు ఉద్యోగాల ఆఫర్‌ లెటర్లు వచ్చాయి. గరిష్టంగా వార్షిక వేతనం రూ.65 లక్షలు ఉంది.

8 బ్రాంచ్‌లు.. 480 సీట్లు

Advertisement
 
Advertisement
Advertisement