భీమవరం: క్రీడల్లో ప్రతిభ కనబర్చిన జిల్లా ఉప మలేరియా అధికారి యాతం నాగబాబును ఎన్‌టీఆర్ నేషనల్ అవార్డ్స్ ఖేల్ రత్న పురస్కారంతో ఘ నంగా సత్కరించారు. ఇటీవల విశాఖలో ఎన్‌టీఆర్, దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నాగబాబుకు పురస్కారం ప్రదానం చేశారు. విశాఖ రత్న కళాపరిషత్ సంస్థ అధ్యక్షుడు తురగా సూర్యారావు, పి.భాస్కరరావు తదితరుల సమక్షంలో పురస్కారం అందుకున్నానని నాగబాబు తెలిపారు. ఇప్పటివరకూ జాతీయ, అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో 105 పతకాలు సాధించానని ఆయన అన్నారు.


