భీమవరం(ప్రకాశం చౌక్): మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఆడుకొవడానికి ప్రజాధనం సుమారు రూ.5 నుంచి రూ.7 లక్షలు ఖర్చు పెట్టి ఇండోర్ క్రికెట్ నెట్ ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయానికి దక్షిణం వైపు ఈ క్రికెట్ నెట్ ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఉన్న భీమవరం ఆర్డీవో ప్రవీణ్‌కుమార్ రెడ్డి అదేశాలతో ఈ క్రికెట్ నెట్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మున్సిపల్ నిధులను కూటమి ప్రభుత్వం ఒక పక్క ఇతర శాఖల ఈవెంట్‌లకు ఉపయోగిస్తోంది. ఇక క్రికెట్ కోసం ప్రత్యేక అధికారి మున్సిపల్ నిధులు వెచ్చిస్తున్నారు. భీమవరం ప్రజల కనీస సౌకర్యాల కోసం మున్సిపల్ నిధులు వినియోగించకుండా, ఇలా ఈవెంట్‌లకు, క్రికెట్ నెట్‌లకు అధికారులు దుర్వినియోగం చేస్తుండడంపై విమర్శలు వెలువెత్తున్నాయి.


