ఐస్‌క్రీమ్‌ ఫ్రిజ్‌లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీమ్‌ ఫ్రిజ్‌లు దగ్ధం

Jun 1 2026 1:02 AM | Updated on Jun 1 2026 1:02 AM

తణుకు అర్బన్‌: తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో వరిచేలు మొదళ్లకు నిప్పు అంటించడంతో సమీపంలోని ఐస్‌క్రీమ్‌ ఫ్రీజర్స్‌ దగ్ధమయ్యాయి. తణుకు అగ్నిమాపక అధికారి ఐ.అజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తేతలిలో లాహమ్‌ ఫుడ్స్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ ఎదురుగా ఉన్న రామలక్ష్మి లేఅవుట్‌లో వరిచేలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో సమీపంలోనే ఉన్న పవన్‌పుత్ర ఎంటర్‌ప్రైజస్‌కు సంబంధించిన 5 ఐస్‌క్రీమ్‌ ఫ్రిజ్‌లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో రూ.2 లక్షలు విలువైన సామాగ్రి నష్టం జరగగా, మరో రూ.5 లక్షల విలువైన సామాగ్రిని రక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement