న్యూస్‌రీల్
గత ప్రభుత్వంలో బ్రేక్
ఎల్‌ఆర్‌ఎస్‌కు ముందుకు రాని రియల్ వ్యాపారులు
పోలీసులకు సత్కారం
పదవీ విరమణ చేసిన పలువురు పోలీసులను శనివారం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీ అస్మీ సత్కరించారు. వారి సేవలను కొనియాడారు. 8లో u
ఆకివీడులో 2.6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు పాత నేరస్తులు ఉన్నారు. 8లో u
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నాన్–లే అవుట్లలో స్థలాల వ్యాపారం జోరుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్‌కు మంచి రోజులొచ్చాయని కూటమి నాయకులు ప్రచారం చేస్తూ, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు. తద్వారా కొనుగోలుదారులను స్థలాల విషయంలో దారుణంగా మోసం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల వ్యవసాయ భూములను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టితో పూడ్చి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. నాన్–లేఅవుట్ అనే విషయాన్ని కొనుగోలుదారులకు తెలియకుండా, తక్కువ ధరకే ఇస్తున్నామంటూ ఆకర్షణీయ ప్రకటనలతో నమ్మిస్తున్నారు. నిబంధనల ప్రకారం లేఅవుట్‌లకు డీటీసీపీ, పంచాయతీ, మున్సిపాలిటీ, ఇతర శాఖల నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ తర్వాతే ప్లాట్లుగా విభజించి విక్రయించాలి. కూటమి నాయకుల అండదండలతో రియల్ వ్యాపారులు నిబంధనలను పక్కనబెట్టి అక్రమ లేఅవుట్ల దందాను జోరుగా సాగిస్తున్నారు.
అక్రమ లేఅవుట్ల పూడికల్లో కూటమి నేతలు
కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మట్టి కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతూ అక్రమ మట్టి దందాకు పూర్తిగా సహకరిస్తున్నారు. స్థానికంగా ఉండే కూటమి నాయకులు, జేసీబీ యజమానులు, కాంట్రాక్టర్ల నుంచి తమ స్థాయిలో మామూళ్లు వసూలు చేస్తున్నారు.
అధికారులకు హెచ్చరికలు
జిల్లాలో నాన్–లే అవుట్ల పూడికలు, అక్రమ మట్టి తోలకాలను అడ్డుకుంటున్న అధికారులకు కూటమి నాయకులు గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఆ లేఅవుట్ మా వాళ్లదే.. దాని జోలికి వెళ్లొద్దు, వెళ్తే చర్యలు తప్పవు అని హెచ్చరిస్తుండడంతో స్థానిక అధికారులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసిన సోమనాథరెడ్డి.. జిల్లా పంచాయతీల పరిధిలో ఉన్న నాన్–లేఅవుట్లపై దృష్టి సారించి చర్యలకు ఉపక్రమించారు. అందులో కూటమి నాయకుల లేఅవుట్లు కూడా ఉండడంతో, ఆయనను జిల్లా నుంచి బదిలీ చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
పట్టించుకోని రెవెన్యూ శాఖ
జిల్లాలోని 20 మండలాలకు సంబంధించి నాన్–లేఅవుట్ల పూడికల కోసం వ్యవసాయ భూములను ఇష్టానుసారంగా తవ్వేస్తున్నప్పటికీ రెవెన్యూ శాఖ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాలోని భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం మూడు రెవెన్యూ డివిజన్ల ఆర్డీఓలు ఈ మట్టి తోలకాలపై కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. వారి డివిజన్ల పరిధిలో అక్రమ మట్టి తోలకాలు దారుణంగా జరుగుతున్నా ఏ ఆర్డీఓ స్పందించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా అక్రమ లే అవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లాలో అక్రమ లేఅవుట్లకు బ్రేక్ పడింది. అందుకు కారణం జిల్లా వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు అందించడం కోసం దాదాపు 1500 ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించి వాటి పూడిక పనులను చేయించడమే. దీనివల్ల అక్రమ లేఅవుట్లు వేయాలనుకునే వ్యాపారులకు మట్టి దొరికే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా ఐదేళ్ల పాటు అక్రమ లేఅవుట్ల వ్యాపారానికి అడ్డుకట్ట పడింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల అక్రమ లేఅవుట్లు వెలిశాయి. నాన్–లేఅవుట్లకు సంబంధించి ఎల్‌ఆర్‌ఎస్ చేసుకోవాలని ప్రభుత్వం తూతూమంత్రంగా ఆదేశాలు ఇచ్చి వదిలేసింది. ఇటీవల ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఎల్‌ఆర్‌ఎస్ లేని నాన్–లేఅవుట్లను అక్కడక్కడా ధ్వంసం చేసి చేతులు దులుపుకుంది. అటు అధికారులు, ఇటు ప్రభుత్వం నాన్–లేఅవుట్ల నియంత్రణను పట్టించుకోకపోవడంతో రియల్ వ్యాపారులు ఎల్‌ఆర్‌ఎస్ ఊసే ఎత్తడం లేదు. దీంతో అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొన్న వారు బిల్డింగ్ ప్లాన్లు, కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలియక కొనుగోలు చేసి మోసపోయామని బాధితులు వాపోతున్నారు.
స్థలాలు కొనుగోలు చేసి మోసపోతున్న ప్రజలు
అక్రమ లే అవుట్ల పూడికల్లో కూటమి నేతల ప్రమేయం
చర్యలు తీసుకున్న పంచాయతీ అధికారిపై బదిలీ వేటు


