ఉండి: ఉండి పంట కాలువలో తూడు, చెత్త తొలగింపు పనులను అధికారులు చేపట్టారు. ఈనెల 27న ‘సాక్షి’లో ప్రచురించిన ‘కలుపు వీడదు.. మురుగు పారదు’ శీర్షికన కథనానికి అధికారులు స్పందించారు. కాలువ శుభ్రం చేసే పనులకు చర్యలు తీసుకున్నారు.
భీమవరం: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షకు 69 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. గణితం పరీక్షకు 1,753 మందికి 1,215 మంది హాజరయ్యారన్నారు. ఎస్‌ఎస్‌సీ (ఏపీఓఎస్‌ఎస్) సైన్స్ అండ్ టెక్నాలజీ పరీక్షకు 294 మందికి 260 మంది, ఇంటర్మీడియట్(ఏపీఓఎస్‌ఎస్) పౌరశాస్త్ర పరీక్షకు 192 మందికి 156 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు.
41 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు : జిల్లాలోని 41 కేంద్రాల్లో నిర్వహించిన ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ జనరల్ పరీక్షకు 8,331 మందికి 7,728 విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖాఽధికారి జి. ప్రభాకరరావు తెలిపారు. ఒకేషనల్ పరీక్షకు 113 మందికి 58 మంది, సెకండియర్ జనరల్ పరీక్షకు 351 మందికి 307 మంది, ఒకేషనల్ పరీక్షకు 137 మందికి 101 మంది హాజరయ్యారన్నారు.
పెనుగొండ: పెనుగొండలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌లో 354 అర్జీలు అందినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. స్థానిక ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు కళాశాలలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అధికారులు ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీల్లో 70 నుంచి 80 శాతం పింఛన్లు, ఇళ్ల స్థలాల మంజూరు, 30 శాతం భూతగాదాలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు పరిధిలో ఉన్నవి వస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఆర్డీఓ దాసి రాజు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి, హౌసింగ్ పీడీ జి. పిచ్చయ్య, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, జెడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: భీమవరం ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈనెల 25న కూటమి నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించిన తీరుపై కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆస్పత్రి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు భారీ ఊరేగింపుగా బాణసంచా కాల్పులతో హంగామా సృష్టించారు. దీంతో మండు టెండలో రోడ్డుపై ప్రజలు, రోగులు ఇబ్బందు లు పడ్డారు. దీనిపై ఈనెల 26న ‘సాక్షి’లో ‘కూటమి నేతల అత్యుత్సాహం’ శీర్షిక కథనాన్ని ప్రచురించగా కలెక్టర్ స్పందించారు. దీనికి కారకులు ఎవరనే విషయాన్ని ఆరా తీసి మందలించినట్టు తెలిసింది. ఆస్పత్రి వద్ద హంగామా చేసే వారు రోగులకు ఎటువంటి స్వాంతన కలిగిస్తారని, ఇటువంటివి పునరావృతమైతే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించినట్టు తెలిసింది.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో రీసర్వే పనులు వేగిరపర్చాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రె వెన్యూ అధికారులతో ఆయన రీసర్వే పురోగతి, పాస్‌బుక్కుల జారీపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు 263 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, 193 గ్రామాల రికార్డులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామన్నారు. మిగిలిన 70 గ్రామాల రికార్డులు త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తహసీల్దార్లను ఆదేశించారు. నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు త ప్పవని జేసీ హెచ్చరించారు. షెడ్యూల్ ప్రకా రం అర్హులైన భూయజమానులందరికీ పాస్‌బుక్కులు జారీ చేయనున్నట్లు చెప్పారు.


