ఓటర్ల నమోదు ప్రరకియలో బీఎల్‌ఏలు కీలకం | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల నమోదు ప్రరకియలో బీఎల్‌ఏలు కీలకం

May 30 2026 8:35 AM | Updated on May 30 2026 8:35 AM

ఓటర్ల నమోదు ప్రరకియలో బీఎల్‌ఏలు కీలకం

పెనుమంట్ర: గ్రామాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియలో బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏ) కీలకమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరా రాజు అన్నారు. శుక్రవారం ఆచంట నియోజకవర్గం తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయంలో నియోజ కవర్గ పరిశీలకురాలు మేడపాటి షర్మిలరెడ్డి అధ్యక్షతన బీఎల్‌ఏలకు అవగాహన సదస్సు నిర్వహించా రు. ముఖ్య అతిథిగా ప్రసాదరాజు మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియోజకవర్గంలో 187 మందిని ఆయన సొంత మనుషుల్లా గుర్తించి ఏజెంట్లుగా నియమించారన్నారు. వీరంతా జగనన్న సైనికుల్లా ఓటరు నమోదు ప్రక్రియలో పనిచేయాలన్నారు. వైఎస్సార్‌సీపీ అనుకూల ఓట్ల ను తొలగించే కూటమి కుట్రల ప్రయత్నాలను అ డ్డుకోవాలన్నారు. ఓటర్ల తుది జాబితా విడుదలయ్యే వరకూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఓటూ ముఖ్యమే.. నియోజకవర్గ పరిశీలకురాలు మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ ప్రతి బీఎల్‌ఏకి 1,100 ఓట్లు ఉంటాయని, ప్రతి ఓటూ కీలకమైందన్నారు. గ్రామాల్లో ప్రజలను ఓట్లు అడి గే హక్కు ఒక వైఎస్సార్‌సీపీకే ఉందన్నారు. గత సా ర్వత్రిక ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేయకపోవడంతో నష్టపోయామనే భావన ప్రజల్లో ఉందన్నారు.

కూటమి కుట్రలను తిప్పికొడదాం

నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకు డు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దొంగ ఓట్లతో గెలవాలని ప్ర యత్నిస్తోందని ఆరోపించారు. ఈ కుట్రలను వైఎ స్సార్‌సీపీ బీఎల్‌ఏలు సమర్థంగా అడ్డుకోవాలన్నా రు. పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ గూడూరి ఉమాబాల మా ట్లాడుతూ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి తమ వంతు కృషి చేయాలన్నారు. రాష్ట్ర అధికా ర ప్రతినిధి నాగార్జునయాదవ్‌ ఓటరు నమోదు ప్ర క్రియలో అనుసరించాల్సిన విధానాలను వివరించారు. పెనుమంట్ర, పోడూరు జెడ్పీటీసీలు కర్రి గౌరీ సుభాషిణి, గుంటూరు పెద్దిరాజు, పెనుమంట్ర ఎంపీపీ కర్రి వెంకటనారాయణరెడ్డి, ఐటీ జనరల్‌ సెక్రటరీ పడాల కనికిరెడ్డి, బీఎల్‌ఏల జిల్లా అధ్యక్షుడు డీవీడీ ప్రసాద్‌, నియోజకవర్గ అధ్యక్షుడు అల్లం భాస్కర్‌రెడ్డి, మండల కన్వీనర్లు, బూత్‌ కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు.

ఆచంట నియోజకవర్గ బీఎల్‌ఏల అవగాహన సదస్సులో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు, పాల్గొన్న బీఎల్‌ఏలు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు

Advertisement
 
Advertisement
Advertisement