భీమవరం: నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పనంటూ మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం మూ ల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి తమనంపూడి సూర్యవెంకట గణేష్‌రెడ్డి హెచ్చరించారు. మెగా డీఎస్సీలో అవకతవకలకు నిరసనగా శుక్రవారం స్థానిక అంబేడ్కర్ సెంటర్‌లో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి పోరు కార్యక్రమంలో మాట్లాడారు. చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ దగా డీఎస్సీగా మారిందన్నారు. డీఎస్సీ జాబితాలో అవకతవకలు, అక్రమాలు జరిగాయని విమర్శించారు. మెరిట్ విద్యార్థులను కాదని స్పోర్ట్స్ కోటా అంటూ అడ్డదారిలో తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించా రు. జిల్లా అధ్యక్షుడు అరిగెల అభిషేక్ మాట్లాడుతూ డీఎస్సీలో ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 లక్షలకు అమ్ముకుని పేద, మధ్యతరగతి నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారన్నారు. ఎన్నికల సమయంలో లక్షలాది ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ యువతను మఽభ్యపెట్టి తీరా అధికారం చేపట్టాక వీటి మాటే మర్చిపోయారన్నారు. రాష్ట్ర కార్యదర్శి గంటా రాహుల్ మాట్లాడుతూ దగా పడ్డ నిరుద్యోగులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉండి న్యాయం చేసే వరకూ పోరాటం చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు మా ట్లాడుతూ ప్రజలను నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబుది అందెవేసిన చెయ్యి అని, ఎప్పుడూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దాఖలాలు లేవన్నా రు. డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని హెచ్చరించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. పార్టీ నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ విద్యార్థి పోరు


