ముగిసిన మట్టి పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన మట్టి పరీక్షలు

May 29 2026 8:04 AM | Updated on May 29 2026 8:04 AM

ముగిసిన మట్టి పరీక్షలు పుష్కరిణి ప్రక్షాళన ఈదురుగాలులు.. భారీ వర్షం గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య నేడు వాసవి పెనుగొండలో పీజీఆర్‌ఎస్‌

పోలవరం రూరల్‌ : కేంద్ర మట్టి, పదార్థాల పరిశోధనా సంస్థ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) బృందం పో లవరం ప్రాజెక్ట్‌లో నిర్వహిస్తున్న పరీక్షలు గురువారంతో ముగిశాయి. ప్రాజెక్టులో ఈసీఆర్‌ఎఫ్‌ పనులు జరుగుతున్న నేపథ్యంలో సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ నిపుణులు సిద్దార్థ్‌ పి.హెడవూ, శ్రీహరి టి.నాయర్‌, గౌరవ్‌ పాండే పరీక్షలు కొనసాగించారు. గ్యాప్‌–2 ప్రాంతంలో పరీక్షలు నిర్వహించారు. నీటి ప్రవాహం ఉన్నపుడు రాళ్లు పరిచిన ప్రాంతం తట్టుకోగలదా లేదా అని ప్రధానంగా పరీక్షించారు. మట్టి, ఇసుక వినియోగించిన ప్రాంతాల్లో కూడా ఇదే తరహా పరీక్షలు కొనసా గాయి. జలవనరుల శాఖ డీఈలు డి.శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, విజయ్‌కుమార్‌, ఎంఈఐఎల్‌ పోల వరం ప్రాజెక్ట్‌ జీఎం కె.గంగాధర్‌, డీజీఎంలు మురళి పమ్మి, శంకరయ్య పాల్గొన్నారు.

ద్వారకాతిరుమల: శ్రీవారి పుష్కరిణి (నరసింహసాగరం)లో తాత్కాలిక అభివృద్ధి పనులు గురువారం ప్రారంభమయ్యాయి. దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు, ఈఈ డీవీ భాస్కర్‌ లు బుధవారం పుష్కరిణి, పరిసర ప్రాంతాల ను పరిశీలించిన విషయం తెలిసిందే. అవి అ ధ్వానంగా ఉన్నట్టు గుర్తించిన అధికారులు వెంటనే తాత్కాలిక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా పుష్కరిణి ఒడ్డున పేరుకుపోయిన కురుడు, చెత్తాచెదారాన్ని పొక్లయిన్‌తో తొలగించారు. డీఈ టి.సూర్యనారాయణ పర్యవేక్షించారు.

సాక్షి నెట్‌వర్క్‌ : అధిక ఉష్టోగ్రతలు, ఉక్కపోత తో ఉక్కిరిబిక్కిరవుతున్న జిల్లావాసులకు గురువారం కాస్త ఊరట లభించింది. రాత్రి సమ యంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఏలూరు, కైకలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు, బుట్టాయగూడెం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు తెగిపడటంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. భారీ శబ్ధాలతో ఉరుములు భయపెట్టాయి. చెట్లు నేలకొరిగాయి.

పెరవలి (కొవ్వూరు): ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్‌ ఎస్సై శ్రీహరి కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పాల కోడేరు గ్రామానికి చెందిన మణికంఠ (26) రెండు రోజుల క్రితం ఇంట్లో తల్లిదండ్రులకు తన ప్రేమ గురించి తెలిపాడు. ఆ అమ్మాయితో వివాహం చేయాలని తెలపడంతో వారు నిరాకరించారు. దీంతో జీవితంపై విరక్తి చెంది మోటార్‌ సైకిల్‌పై కొవ్వూరు మండలం మద్దూరు వద్ద గోదావరి బ్యారేజీ వద్దకు వచ్చి, అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు గోదావరిలో దూకిన సమయంలో బ్యారేజీ తలుపులపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం మృతదేహం పైకి తేలడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీహరి తెలిపారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ఒక నెల–ఒక గ్రా మం–నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆచంట నియోజకవర్గంలోని వాసవి పెనుగొండలో ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. ఎస్‌వీకేపీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి మ ధ్యాహ్నం 1 గంట వరకు అర్జీలు, వినతులు స్వీ కరిస్తామన్నారు. జిల్లా, డివిజన్‌, మండల స్థా యి అన్ని శాఖల అధికారులు ఉదయం 8.30 గంటలకే కళాశాల ప్రాంగణానికి చేరుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement