ఎస్సై దాతృత్వం | - | Sakshi
Sakshi News home page

ఎస్సై దాతృత్వం

Apr 4 2026 8:07 AM | Updated on Apr 4 2026 8:07 AM

ఎస్సై దాతృత్వం వీఆర్‌కు తడికలపూడి ఎస్సై విద్యుత్‌ తీగ తెగిపడి ఐదు పశువులు మృతి రక్తదానం మహోన్నతం ఎకై ్సజ్‌ స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ

లింగపాలెం: మండలంలోని ములగలంపాడులో ఇటీవలే కొడుకులు సరిగ్గా చూడక ఇంటి బయట చెట్టు కింద వృద్ధురాలు నివాసం ఉంటుంది. స్థానికులు, సోషల్‌మీడియాలో వచ్చిన కథనాలకు ఎస్సై వెంకన్న స్పందించారు. వృద్ధరాలి దగ్గరకు వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడి ఆమెను పక్కనే ఉన్న వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర పెట్టి ఆ వృద్ధురాలికి త్వరలోనే నివాసం ఏర్పాటు చేయాలని కుమారులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

కామవరపుకోట: తడికలపూడి పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై చెన్నారావును పోలీస్‌ ఉన్నతాధికారులు వీఆర్‌లో పెట్టారు. తడికలపూడి ఎస్సైగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు గడిచింది. శాఖా పరమైన కారణాలతో వీఆర్‌లో పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఇన్‌చార్జి ఎస్సై జంగారెడ్డిగూడెం ట్రాఫిక్‌ ఎస్సైగా పని చేస్తున్న కుటుంబరావును నియమించారు.

వేలేరుపాడు: గాలి వల్ల 11 కేవీ లైన్‌ కొయిదా ఫీడర్‌ వైర్‌ తెగడంతో వేలేరుపాడు మండలంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో ఐదు పశువులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. శివకాశీపురం గ్రామంలో శ్రీనివాసరావు చెందిన ఐదు ఎద్దులను (పశువులు) ఇదే గ్రామానికి చెందిన కుంబటి నాగరాజు శుక్రవారం మధ్యాహ్నం దగ్గరలోని పొలాలకు మేతకు తీసుకెళ్లాడు. తిరిగి ఇంటికి తోలుకొస్తున్న క్రమంలో ఒక్కసారిగా గాలి రావడంతో 11కేవీ లైన్‌ విద్యుత్‌ వైరు తెగి పశువులపై పడింది. దీంతో ఐదు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ సమయంలో నాగరాజు పక్కకు పారిపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

గణపవరం: రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని, రక్తదానంతో మరొకరికి ప్రాణదానం చేయవచ్చని గణపవరానికి చెందిన పద్మపూజిత గ్రూపు చైర్మన్‌ ఆర్‌.బసవరాజు అన్నారు. శుక్రవారం గణపవరంలో పద్మపూజిత గ్రూపు సంస్థల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిబిరాన్ని ప్రారంభించిన బసవరాజు రక్తదానంపై ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా స్వచ్ఛందంగా రక్తదానం చేసేలా చైతన్యవంతులు చేయాలని యూత్‌ సభ్యులకు సూచించారు. ఈ శిబిరంలో రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో పద్మపూజిత అనుబంధ సంస్థల జోనల్‌, ఏరియా అధికారులు ఫణి, అనిల్‌ పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ జంగారెడ్డిగూడెం, పోలవరం సర్కిల్‌ కార్యాలయాలను శుక్రవారం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమీషనర్‌ కేవీ నాగ ప్రభుకుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, సర్కిల్‌ పరిధిలో చేపట్టిన కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. సిబ్బందిని నాటు సారాకు సంబంధించి సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నాగ ప్రభుకుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి సుంకం చెల్లించని మద్యంపై నిఘా ఉంచాలని సూచించినట్లు తెలిపారు. అనంతరం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులోని బోర్డర్‌ చెక్‌పోస్టును ఆయన తనిఖీ చేసి, సూచనలు చేశారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం, పోలవరం సీఐలు కె.శ్రీనుబాబు, కె.వీరబ్రహ్మం, ట్రైనీ ఎస్సై సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు.

నేటి నుంచి

పాలిసెట్‌ ఉచిత కోచింగ్‌

తాడేపల్లిగూడెం (టీఓసీ): పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షకు ఉచితంగా కోచింగ్‌ ఇవ్వనున్నట్లు ఎస్‌ఎ్‌ఫ్‌ఐ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గణేష్‌, పతివాడ నాగేంద్రబాబు తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ భీమవరంలోని డాక్టర్‌ బీవీరాజ్‌ విద్యా సంస్థల్లోని బి.సీతా పాలిటెక్నిక్‌ కళాశాలలో శిక్షణ ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు 90141 52239, 91823 09153, 76809 17097 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement