సమస్యలపై నిలదీత | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై నిలదీత

Mar 23 2026 7:01 AM | Updated on Mar 23 2026 7:01 AM

కోరం లేకుండా జెడ్పీ సమావేశమా?

కోరం లేకుండా జెడ్పీ సమావేశమా?

తీర్మానాల ఆమోదంపై సభ్యుల ధ్వజం

వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీల వాకౌట్‌

జెడ్పీ చైర్‌పర్సన్‌ తీరుపై మండిపాటు

ఏలూరు రూరల్‌ : సభ్యులు హాజరు కాకుండా, కో రం లేకుండా జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించడం, తీర్మానాలు ఆమోదించడం రా జ్యాంగ విరుద్ధమంటూ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సభ్యులను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరులో జెడ్పీ సీఈఓ భీమేశ్వర్‌ పర్యవేక్షణలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రా రంభం కాగానే చైర్‌పర్సన్‌ పలు పనులపై అధికారులతో సమీక్ష చేపట్టారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్‌, పోడూరు జెడ్పీటీసీ గుంటూరి పెద్దిరా జు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదట ప్రజాసమస్యలపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ రిజిస్టర్‌లో సంతకం చేస్తేనే సమావేశంలో మాట్లాడాలని, లేదంటే సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. వెంటనే జెడ్పీటీసీలు కోరిపల్లి జయలక్ష్మి (ఉంగుటూరు), తుమ్మగుంట భవాని (భీమడోలు), ముళ్లపూడి అన్నపూర్ణాదేవి (తణుకు), ఉప్పులూరి వరలక్ష్మి (పెంటపాడు) మాట్లాడుతూ గతంలో రిజిస్టర్‌లో సభ్యులు చేసిన సంతకాలను తప్పుడు తీర్మానాలకు ఆమోదం చేసినట్టుగా చూపి అక్రమాలకు పాల్పడ్డారని, అందుకే రిజిస్టర్‌లో సంతకం చేయమని అన్నారు. దీంతో చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ సంతకాలు చేయని సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వమని అనడంతో ఏలూరు, దెందులూరు జెడ్పీటీసీలతో పాటు 11 మంది వాకౌట్‌ చేశారు. మరోపక్క వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌ ప్రజా సమస్యలపై గళమెత్తారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులను కొనసాగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం పరిసర గ్రామాల్లో రోడ్ల పక్కన బెల్టుషాపులు పెరిగిపోయాయని, దీంతో పేదల జేబులు గుల్లకావడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయని జెడ్పీటీసీ ఆంజనేయులు అధికారులను నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement