ప్రసాద్‌కు అవార్డు అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

ప్రసాద్‌కు అవార్డు అభినందనీయం

Mar 23 2026 7:01 AM | Updated on Mar 23 2026 7:01 AM

ప్రసాద్‌కు అవార్డు అభినందనీయం ఎలక్ట్రీషియన్లను ఆదుకోవాలి భక్తుల చెంతకే జలప్రసాదం

భీమవరం (ప్రకాశంచౌక్‌) : ఎంత ఎదిగినా ఒది గి ఉండాలనే సౌమ్యులు పిప్పళ్ల ప్రసాద్‌ అని, నిర్దిష్ట జీవితాన్ని గడుపుతూ నాలుగు దశాబ్దాలుగా సంగీత విద్వాంసులుగా అందరి మన్ననలు పొందుతూ అవార్డు సాధించడం అభినందనీయమని శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ద్వారా ఉత్తమ సంగీత విద్వాంసుడిగా ఉగాది పురస్కారాన్ని అందుకున్న డాక్టర్‌ పిప్పళ్ల ప్రసాద్‌ను శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో స్థానిక భీమేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం సత్కరించారు. ముఖ్య అతిథిగా మోషేన్‌రాజు హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, కృష్ణ బలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ గంటా త్రిమూర్తులు మాట్లాడారు. భట్టిప్రోలు శ్రీనివాసరావు, నందమూరి రాజేష్‌, పాలకోడేటి కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్లు సరైన సదుపాయాలు లేక వీధిన పడుతున్నారని, ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జా రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఆదివా రం రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్లు శ్రీనివాసరావు అధ్యక్షతన రాష్ట్ర జనరల్‌ బాడీ సమావేశం ఏ లూరులో జరిగింది. ముఖ్య అతిథిగా రామకృష్ణ మాట్లాడుతూ కార్మిక శాఖ క్లయిమ్‌లు పరిష్కరించాలని, ప్రభుత్వమే టూల్‌కిట్లు ఇవ్వాలని, రుణాలు, ఈఎస్‌ఐ కల్పించాలని, ప్రమాద బీమా అమలు చేయాలని కోరారు. అనంతరం హేలాపురి ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ యూనియన్‌, ఇఫ్టూ అనుబంధ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా మై చర్ల శంకరరావు, అధ్యక్షుడిగా లింగమల్లు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా బత్తిన శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా అనుపోజు ఉమా విజయ్‌ సాయి, కోడి రవి, సంయుక్త కార్యదర్శులుగా తోట మోహన్‌రావు. పోసిన జగదీష్‌, కోశాధికారిగా పిట్టా తరుణ్‌ సాయి కుమార్‌ను ఎన్నుకున్నారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా వీరవరపు నాగేశ్వరావు, సిరిగిరి సత్యనారాయణను ఎన్నుకున్నారు.

ద్వారకాతిరుమల: రోజురోజుకూ పెరుగుతున్న ఎండ వేడిమి నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు చినవెంకన్న దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా ఆదివారం మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా కొందరు సి బ్బంది భుజాలకు స్ప్రే పంప్‌ టిన్‌లను తగిలించుకుని, భక్తుల వద్దకు వెళ్లి మరీ మంచినీరు (శ్రీ వారి జలప్రసాదం) అందిస్తున్నారు. దీనిపై భ క్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అడిగి మరీ.. దాహం తీరుస్తున్నారని ప్రశంసిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement